RRR : ఆర్ఆర్ఆర్ నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్.. ఆ విషయంలో రాజమౌళి నిర్ణయం అదే..

RRR ఎన్టీఆర్, రామ్ చరణ్ (Twitter/Photo)

RRR  (Roudram Ranma Rudhiram) | RRR : ఆర్ఆర్ఆర్ నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్.. ఆ విషయంలో రాజమౌళి నిర్ణయం ఫైనల్ అట. వివరాల్లోకి వెళితే..

 • Share this:
  RRR  (Roudram Ranma Rudhiram) | RRR : ఆర్ఆర్ఆర్ నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్.. ఆ విషయంలో రాజమౌళి నిర్ణయం ఫైనల్ అట. వివరాల్లోకి వెళితే.. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌ (Ram Charan), అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.  అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ముందుగా దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా.. ఫైనల్‌గా  RRR మూవీని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్టు  ప్రకటించారు.

  రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’ సడెన్‌గా సంక్రాంతి బరిలో దిగడంతో మిగతా నిర్మాతలు, హీరోలు జక్కన్న తీసుకున్న డెసిషన్ పై ఒకింత ఆగ్రహాంగా ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అజయ్ దేవ్‌గణ్లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఉక్రెయిన్ వెళ్లి వచ్చింది.

  సంక్రాంతి బరిలో ఎంత మంది ఉన్న తగ్గేది లేదంటున్న బంగార్రాజు.. నాగార్జున ధైర్యం ఏంటి..

  దానికి ఒక రోజు ముందు అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్ నటిస్తోన్న ‘గంగూభాయ్ కతియావాడి’ సినిమా విడుదల అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్‌ను రాజమౌళి ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా ఫైనల్‌గా 3 గంటల 15 నిమిషాలు వచ్చిందట. చివరగా జక్కన్న ఈ సినిమాను ట్రిమ్ చేసి  చివరగా 2 గంటల 45 నిమిషాలకు అన్ని భాషల్లో ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇధే ఫైనల్‌ అని కూడా చెబుతున్నారట. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను దుబాయ్‌లో నిర్వహించాలనే ప్లాన్‌లో ఉన్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.

  Bollywood 2022 Release Movies : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సహా బాలీవుడ్‌లో విడుదల కాబోతున్న టాలీవుడ్ హీరోల ప్యాన్ ఇండియా మూవీస్ ఇవే..

  ఇప్పటికే  ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను ఎన్టీఆర్, రామ్  చరణ్‌ పూర్తి చేశారట. ఎన్టీఆర్.. కేవలం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను ఎన్టీఆర్ చెప్పుకోవడం విశేషం. ఇటు రామ్ చరణ్.. తెలుగు, హిందీ, తమిళంలో మాత్రమే తన క్యారెక్టర్‌కు తానే డబ్బింగ్ చెప్పినట్టు సమాచారం. అటు అజయ్ దేవ్‌గణ్, ఆలియాతో పాటు మిగతా నటీనటులు ఈ సినిమా డబ్బింగ్ పనులు పూర్తి చేసేసారు.

  అల్లు అర్జున్ ఆ తర్వాత ఎన్టీఆర్.. ఆపై మహేష్ బాబు, పవన్ కళ్యాణ్..

  ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు. ఇక ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది.

  Priyamani: పొట్టి నిక్కరులో పిచ్చెక్కించిన ప్రియమణి.. వావ్ అనాల్సిందే..

  పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: