Home /News /movies /

RRR ROUDRAM RANAM RUDHIRAM MOVIE CREATS NEW RECORD IN NIZAM TELANGANA AREA AND THIS MOVIE CREATING HISTORY AND HEADING TOWARDS 75 CRORE SHARE MARK TA

RRR: నైజాం(తెలంగాణ)లో RRR సరికొత్త రికార్డు.. కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన రాజమౌళి..

నైజాంలో ఆర్ఆర్ఆర్ నయా హిస్టరీ (RRR RRR Photo : Twitter)

నైజాంలో ఆర్ఆర్ఆర్ నయా హిస్టరీ (RRR RRR Photo : Twitter)

RRR Nizam Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి  (Rajamouli) డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. తాజాగా ఈ సినిమా నైజాం గడ్డపై సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.

    RRR Nizam Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి  (Rajamouli) డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan)  వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీగా మొదటి రోజు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు. ఇక ఈ సినిమా నైజాం (తెలంగాణ)లో రికార్డు స్థాయిలో బిజినెస్ క్రియేట్ చేసింది. తాజాగా ఇక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించడమే కాకుండా.. బ్రేక్ ఈవెన్‌ అయింది. తెలుగు సినిమాల విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ) మార్కెట్ (Nizam Market) చాలా పెద్దది. ఒకప్పుడు ఇక్కడ రూ.  10 కోట్ల మార్క్ అందుకుంటే వామ్మో అనుకునే వాళ్ళు. కేవలం చిరంజీవి వంటి  సినిమాలు మాత్రమే ఎక్కువగా రూ.  10 కోట్ల మార్కును అందుకునేవి.

    ఆ తర్వాత మెల్లమెల్లగా మహేష్ బాబు (Mahesh Babu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan), ప్రభాస్ (Prabhas) లాంటి హీరోలు కూడా నైజాంలో తమకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకున్నారు. మరీ ముఖ్యంగా గత కొంతకాలంగా నైజాంలో తెలుగు సినిమాలు అత్యధిక వసూళ్లు సాధిస్తున్నాయి. ఒకప్పుడు రూ. 10 కోట్లు ఫుల్ రన్‌లో వస్తే గొప్ప అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్క రోజులోనే రూ. 10 కోట్లు వచ్చేస్తున్నాయి. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా అయితే ఏకంగా మొదటి రోజు 25 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత కూడా అదే జోరు కంటిన్యూ చేస్తోంది ఈ సినిమా. నైజాంలో ఈ సినిమాను 70 కోట్లకు కొంటే ట్రేడ్ సైతం ఆశ్చర్య పోయింది.

    Pawan Kalyan - Vishwak Sen : పవన్ కళ్యాణ్ బాటలో వకీల్ సాబ్ పాత్రలో యువ హీరో విశ్వక్ సేన్..

    ఇన్ని డబ్బులు రావాలంటే ఎంతమంది సినిమా చూడాలి.. ఎన్నిరోజులు లాంగ్ రన్ ఉండాలి అంటూ లెక్కలు వేసుకున్నారు. కానీ ఆరు రోజులు ముగిసేసరికి నైజాం గడ్డపై ఏకంగా రూ. 70 కోట్లకు పైగా  షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెనై నయా చరిత్ర సృష్టించింది త్రిబుల్ ఆర్ సినిమా. అసలు కలలో కూడా ఊహించని విధంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ కురుస్తుంది. ఆరో రోజు కూడా ఈ చిత్రానికి 4.80 కోట్ల షేర్ వచ్చింది నైజాంలో. అంతేకాదు.. నైజాంలో తొలి ఆరు రోజుల కలెక్షన్ల విషయానికొస్తే..

    మొదటి రోజు :  రూ. 23.35 కోట్లు
    రెండో రోజు : రూ.15.10 కోట్లు
    మూడో రోజు : రూ. 15.05 కోట్లు
    నాలుగో రోజు : రూ. 8.15 కోట్లు
    ఐదో రోజు : రూ. 6.70 కోట్లు
    ఆరో రోజు :రూ. 4.80 కోట్లు
    నైజాం ఆరు రోజుల కలెక్షన్లు.. రూ. 73.15 కోట్లు..

    Rangasthalam : ’రంగస్థలం’లో రామ్ చరణ్, సమంత మధ్య లిప్‌లాక్ సీన్.. ? అసలు కథ ఇదే..

    తెలంగాణలో రూ. 70 కోట్ల బిజినెస్ చేసింది. రూ. 75 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగింది. బ్రేక్‌ ఈవెన్‌ అయింది. అంతేకాదు.. నైజాంలో మొదటి రూ. 75 కోట్లు షేర్ సాధించిన సినిమాగా ఇది చరిత్ర సృష్టించడం ఖాయం. అసలు కలలో కూడా ఈ రికార్డు ఈ మధ్య కాలంలో మరో సినిమాకు సాధ్యం కావడం కష్టమే. బాహుబలి 2 అనుకుంటే.. దాన్ని మించిపోయేలా కలెక్షన్లు వస్తున్నాయి ఈ చిత్రానికి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలో ఉండటం.. ఇద్దరికి అదిరిపోయే మార్కెట్ ఉండటం.. దానికి తోడు రాజమౌళి అనే బ్రాండ్ సినిమాకు మరింత హెల్ప్ అవుతుంది. బాహుబలి 2 సినిమాకు ఐదేళ్ల కింద నైజాంలో రూ.  66.63 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు దాన్ని చాలా మార్జిన్‌తో దాటటం అనేది పక్కా.  మొత్తంగా ఆర్ఆర్ఆర్ ఇప్పుడు రూ. 100  కోట్ల వరకు షేర్ తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సి పనిలేదు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jr ntr, Rajamouli, Ram Charan, Roudram Ranam Rudhiram, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు