RRR ROUDRAM RANAM RUDHIRAM ANOTHER RECORD IN US PREMIERS AND ITS CROSS BAHUBALI 2 RECORD IN US PREMIERS TA
RRR : విడుదలకు ముందే ఆ ఏరియాలో బాహుబలి 2 రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్.. జక్కన్న మజాకా..
ఆర్ఆర్ఆర్ మరో రికార్డు (Twitter/Photo)
RRR Roudram Ranam Rudhiram : ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఆర్ఆర్ఆర్ ఫీవర్‌తో ఊగిపోతోంది. తాజాగా ఈ సినిమా విడుదలకు ముందు మరో రికార్డును క్రియేట్ చేసింది.
RRR Roudram Ranam Rudhiram : ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఆర్ఆర్ఆర్ ఫీవర్‌తో ఊగిపోతోంది. రిలీజ్‌కు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటం పైగా ప్యాన్ ఇండియా మూవీ కావడంతో రాజమౌళి.. ఎన్టీఆర్,రామ్ చరణ్‌లను వెంటేసుకొని దేశం మొత్తాన్ని చుట్టేస్తున్నారు. ఇక ఈ సినిమాను మేకర్స్.. ఐమాక్స్, 3D, డాల్బీ ఫార్మాట్లో రిలీజ్ చేస్తున్నారు.ఇక డాల్బీ విడుదల కాబోతున్న మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయింది. తెలంగాణ (నైజాం), ఏపీ, సీడెడ్‌తో పాటు అన్ని ఏరియాల్లో ఈ సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. బాహుబలి కంటే దాదాపు రూ. 80 కోట్లకు పైగా బిజినెస్ చేసి ఔరా అనిపించింది. రాజమౌళి తన రికార్డ్‌ను తానే అధిగమిస్తున్నారు.
ఈ సినిమా చూసిన తర్వాత ఈ హీరో తక్కువ.. ఆ హీరో ఎక్కువా అనే లెక్కలు లేకుండా ఓ ఎమోషనల్ ఫీలింగ్‌తో థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటికి వస్తారని నమ్మకంగా చెప్తున్నారు రాజమౌళి. దానికి తగ్గట్లుగానే ఈ సినిమా బిజినెస్ కూడా జరుగింది. ఇక ఓవరాల్‌గా ఈ సినిమా యూఎస్‌లో ప్రీ రిలీజ్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
ఈ సినిమా ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్ ద్వారా దాదాపు 2.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది. గతంలో బాహుబలి 2 మిలియన్స్ ప్రీమియర్స్ ద్వారా కలెక్ట్ చేస్తే .. ఆర్ఆర్ఆర్.. మాత్రం 2.5 మిలియన్ డాలర్స్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఈ రకంగా ప్రీ రిలీజ్ బుకింగ్స్‌లో కూడా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఇక ఆర్ ఆర్ ఆర్ (RRR) విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు ఈ (RRR) చిత్రం ఓటిటి రిలీజ్ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ (RRR) విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.