RRR ROUDRAM RANAM RUDHIRAM 13 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS TA
RRR 13 Days WW Collections : ఆర్ఆర్ఆర్ 13 డేస్ వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే..
ఆర్ఆర్ఆర్ 13 డేస్ కలెక్షన్స్ (RRR collections)
RRR 13 Days World Wide Box Office Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తోంది. మొదటి 9 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది. తాజాగా ఈ సినిమా 13వ రోజు బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లను రాబట్టిందంటే..
RRR 13 Days World Wide Box Office Collections : ఆర్ఆర్ఆర్రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్,రామ్ చరణ్ (Jr NTR, Ram Charan) వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీగా మొదటి రోజు వసూళ్లను రాబట్టి దాదాపు అదే జోరు కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర ఒక్కో రికార్డును స్మాష్ చేస్తూ వెళుతోంది. వీక్ డేస్‌లో బాక్సాఫీస్ రేసులో వెనకబడ్డ ఈ సినిమా .. ఓవరాల్‌గా వీకెండ్లో ఉగాదితో పాటు ఆది వారం ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది. కానీ సోమవారం ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. బుధవారం 13వ రోజు ఏమంత ఆశాజనకంగా ఈ సినిమా కలెక్షన్లు లేవు. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. ఇక ఈ సినిమాను మేకర్స్.. ఐమాక్స్, 3D, డాల్బీ ఫార్మాట్లో రిలీజ్ చేసారు. ఇక డాల్బీ విడుదలైన మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది.
ఆలియా భట్, ఒలివియా మోరీస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఓవరాల్‌గా నైజాంలో ఆరో బ్రేక్ ఈవెన్ పూర్తైయింది. దాంతో ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్కడక్కడ రూ. కోటి వరకు షేర్ రాబట్టాల్సి ఉంది. 13వ రోజు ఈ సినిమా తెలంగాణ+ ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 1.26 + రూ. 1.26 కోట్లు కలిపి మొత్తంగా రూ. 2.54 కోట్లు షేర్ (రూ. 4 కోట్లు గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్, తమిళనాడు, కర్ణాటక మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.9 కోట్లు రాబట్టింది. ఈ రెండు కలిపితే ప్రపంచ వ్యాప్తంగా పదమూడో రోజు ఈ సినిమా రూ. 7.44 కోట్లు షేర్ (రూ. 13 కోట్లు గ్రాస్) రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 13 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..
Day 1 - రూ. 74.11 కోట్లు
Day 2: రూ. 31.63 కోట్లు .
Day 3 : రూ. 33.53 కోట్లు
Day 4 : రూ. 17.73 కోట్లు
Day 5: రూ. 13.63 కోట్లు .
Day 6 : రూ. 9.54 కోట్లు
Day 7 : రూ. 7.48 కోట్లు
Day 8: రూ. 8.33 కోట్లు .
Day 9 : రూ. 19.62 కోట్లు
Day 10 : రూ. 16.10 కోట్లు
Day 11 : రూ. 4.98 కోట్లు
Day 12 : రూ. 4.88 కోట్లు
Day 13: రూ. 2.54 కోట్లు .
Telagana - AP : రూ. 246.90 కోట్లు (రూ. 371 కోట్లు) తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 246.90 కోట్లు (రూ. 371.00 కోట్లు గ్రాస్)/ (టోటల్ తెలంగాణ+ఏపీ బిజినెస్ రూ. 191 కోట్లు) ముందుగా రూ. 211 కోట్లకు అమ్మారు. కొన్ని ఏరియాల్లో తగ్గించిన తర్వాత రూ. 191కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది.
ఆర్ఆర్ఆర్ మొదటి రోజు.. రూ. 135 కోట్లు ( 235 కోట్లు గ్రాస్ )
రెండో రోజు : రూ. 67.44 కోట్లు (121 కోట్లు గ్రాస్ )
మూడో రోజు : రూ. 78.73 కోట్లు (రూ. 140 కోట్లు గ్రాస్ )
నాలుగో రోజు : రూ. 35.88 కోట్లు (రూ. 69 కోట్లు గ్రాస్)
ఐదో రోజు : రూ. 31.13 కోట్లు (రూ. 60 కోట్లు గ్రాస్)
ఆరో రోజు : రూ. 23.19 కోట్లు (రూ. 45 కోట్ల గ్రాస్ ) ఏడో రోజు : రూ. 21.08 కోట్లు (రూ, 40 కోట్ల గ్రాస్ ) ఎనిమిదో రోజు: రూ. 22.03 కోట్లు (41 కోట్ల గ్రాస్) తొమ్మిదో రోజు : రూ. 37.12 కోట్లు (రూ. 69 కోట్ల గ్రాస్) పదో రోజు : రూ. 44.80 కోట్లు (రూ. 80 కోట్ల గ్రాస్) పదకొండో రోజు : రూ. 12.68 కోట్లు (రూ. 20 కోట్ల గ్రాస్) పన్నెండో రోజు : రూ. 11.58 కోట్లు (రూ. 18.50 కోట్ల గ్రాస్) పదమూడో రోజు : రూ. 7.44 కోట్లు (రూ. 14.5 కోట్ల గ్రాస్)
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 13 రోజు వరకు రూ. 528.50 కోట్ల షేర్ రాబట్టింది. హిందీలో మొదటి రోజు తక్కువే వచ్చినా ఆ తర్వాత రోజుకు రోజుకు కలెక్షన్ల రేంజ్ పెంచుకుంటూ పోతుంది. మొత్తంగా హిందీలో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. ఓవరాల్‌గా కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో మాత్రమే బ్రేక్ ఈవెన్‌కు కాస్త దూరంలో ఉంది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఓవరాల్‌గా రూ. 75.50 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.