హోమ్ /వార్తలు /సినిమా /

RRR Update: ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ .. అదే షాట్‌తో ఓపెనింగ్.. అదే షాట్‌తో క్లోజింగ్.. ఇంతకీ ఆ షాట్ చూడండి..

RRR Update: ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ .. అదే షాట్‌తో ఓపెనింగ్.. అదే షాట్‌తో క్లోజింగ్.. ఇంతకీ ఆ షాట్ చూడండి..

SS Rajamouli

SS Rajamouli

RRR Release Date: ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ కూడా ఆశగా ఎదురుచూస్తోంది. బాహుబలి తర్వాత రాజమౌళి (Rajamouli) తీస్తున్న పాన్ ఇండియా సినిమా కోసం మెగా (Mega Family), నందమూరి (Nandamuri Family) ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంకా చదవండి ...

  దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న RRR Movie షూటింగ్ మొత్తం పూర్తయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) యాక్ట్ చేస్తున్న ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టారు. అయితే, ఇందులో చాలా ఇంట్రస్టింగ్ న్యూస్ ఉంది. రాజమౌళి కెరీర్‌లో తొలిసారి ఇలాంటి సీన్ వర్కవుట్ అయిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అంత స్పెషల్ పాయింట్ ఏంటంటే.. ఈ సినిమాను ఏ షాట్ తో అయితే మొదలు పెట్టారో అదే షాట్‌తో ముగించారు. అయితే, ఆ షాట్ ఏంటో తెలుసా? బైక్ షాట్. బైక్ మీద జూనియర్ ఎన్టీఆర్ డ్రైవింగ్ చేస్తుంటే రామ్ చరణ్ వెనుక కూర్చుని ఉన్న షాట్‌తోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 2018 సంవత్సరం నవంబర్ నెల 19న ఆర్ఆర్ఆర్ సినిమాకు కొబ్బరికాయ కొట్టాక ఈ షాట్ ఫస్ట్ తీశారు. ఇప్పుడు ఇదే షాట్‌ తీశాక గుమ్మడికాయ కొట్టారు.

  ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు రిలీజ్ (RRR Release Date) అవుతుందనేదానికి ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఇప్పటికే చాలా చాలా సార్లు వాయిదా పడిన రిలీజ్ డేట్ ఇంకా వాయిదాలు పడుతూనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో సినిమా రిలీజ్ అనుకున్నారు. కానీ, అది కూడా ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదని సమాచారం.

  ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గ్రాఫికల్ కంటెంట్ కూడా భారీగా ఉండడంతో అవి ఎప్పటి వరకు పూర్తవుతాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. వాటిపై ఓ అవగాహన వస్తే ఆ తర్వాత సినిమా రిలీజ్ డేట్ మీద క్లారిటీ రానుంది. ప్రస్తుతం సినిమా యూనిట్ కూడా ఆర్ఆర్ఆర్ మూవీని రిలీజ్ చేయడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదని సమాచారం.

  RRR Update Netizens Trolling NTR Ram Charan New Poster Do not Wearing Helmet,RRR: ఆర్ఆర్ఆర్ కొత్త పోస్టర్ పై నెటిజన్స్ ట్రోలింగ్స్.. ఆ విషయమై ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను టార్గెట్ చేస్తూ..,rrr movie,Jr NTR,Ram Charan, NTR Ram Charan Not Wear Helmet,rrr movie twitter,rrr movie shooting,rrr movie new poster,ram charan ntr bike poster,rrr movie shooting completed 2 songs balance,telugu cinema,ట్రిపుల్ ఆర్ షూటింగ్ రెండు పాటలు మినహా పూర్తి,2 భాషల్లో డబ్బింగ్ పూర్తి చేసిన చరణ్ తారక్,హెల్మెట్ లేకుండా రామ్ చరణ్ ఎన్టీఆర్
  ట్రిపుల్ ఆర్ పోస్టర్ (RRR movie)

  అక్టోబర్‌లో కరోనా వైరస్ మూడో వేవ్ (Coronavirus Third wave) వస్తుందనే ప్రచారం ఉంది. పండుగల సీజన్ కావడంతో అప్పుడు పెరుగుతుందేమో అని నిపుణులు భావిస్తున్నారు. దీనికి తగినట్టు ఇటీవల ధియేటర్లలో రిలీజ్ అయిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) సినిమా బెల్ బాటమ్ కూడా పేలవంగా నడిచింది. దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత రాజమౌళి అండ్ టీమ్ ఆర్ఆర్ఆర్ సినిమాను మరికొన్ని రోజులు వాయిదా వేద్దామని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Jr ntr, Ramcharan, Rrr movie, RRR release date, SS Rajamouli

  ఉత్తమ కథలు