ఆర్ ఆర్ ఆర్ ప్లేస్‌లో ఆచార్య... మరోసారి విడుదల తేది మార్పు..

ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: May 4, 2020, 12:23 PM IST
ఆర్ ఆర్ ఆర్ ప్లేస్‌లో ఆచార్య... మరోసారి విడుదల తేది మార్పు..
రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, చిరంజీవి Photo : Twitter
  • Share this:
ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. కాగా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల సీతారామరాజుగా చరణ్ ఎంట్రీ అదిరింది. చరణ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ ఎలా ఉండనున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా జనవరి 08 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కరోనా కారణంగా ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. తర్వాత షెడ్యూల్ పూణేలో మొదలుకానుంది. అయితే ఈ సినిమా గురించి ఓ కొత్త అప్ డేట్ ఏమంటే.. కరోనా కారణంగా దాదాపు నెల రోజులపాటు జరగాల్సీన షూటింగ్ వాయిదా పడింది.

మరోవైపు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా ఆలియా భట్, చరణ్‌లపై అలాగే ఎన్టీఆర్ ఒలివియా మోరీస్‌లపై చిత్రికరించాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయట. దీనికి తోడు కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రాల్సిన నేపథ్యంలో సినిమా విడుదల తేదిని మరోసారి ముందుకు జరపనున్నారని తాజా సమాచారం. అయితే ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదిని చిరంజీవి వాడుకోనున్నాడని టాక్. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే పేరుతో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మొదట దసరాకు అనుకున్న కరోనా కారణంగా సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
First published: May 4, 2020, 12:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading