Home /News /movies /

RRR RAM CHARAN SPECIAL THANKS TO JR NTR AND MEGA FANS TO SUPPORT FOR US IN RRR PRE RELEASE EVENT TA

RRR - Ram Charan : తారక్‌ అభిమానులకు, నీడలా అండగా ఉన్న ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు..

RRR ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ స్పీచ్ (Twitter/Photo)

RRR ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ స్పీచ్ (Twitter/Photo)

ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం)  (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ శనివారం కర్ణాటకలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్.. తమను నీడలా అండగా ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసారు.

ఇంకా చదవండి ...
    RRR - Ram Charan : తారక్ అభిమానులకు, నీడలా అండగా ఉన్న ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ .. కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌బళ్లాపూర్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే.. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం)  (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లోఅజయ్ దేవ్‌గణ్ స్పెషల్ రోల్లో  రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిన మూవీ ఆర్ఆర్ఆర్.  అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే.

    ఈ శనివారం కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ఈ  వేడుకలకు కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మైతో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. పునీత్ రాజ్‌కుమార్ లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానన్నారు. శివన్నలోనే పునీత్‌ను చూసుకుంటున్నామన్నారు.

    RRR Pre Relese Event : రామ్ చరణ్ నా రాముడు.. ఎన్టీఆర్ నా భీముడు.. ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి..

    ఆర్ఆర్ఆర్ ప్రయాణం అనేది ఓ మరిచిపోలేని అనుభూతి. ఈ సినిమా చేస్తున్నపుడు తనకు తారక్‌కు నీడలా వెంట ఉన్న అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులతో పాటు రామ్ చరణ్ తన ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో కష్టపడి ఇష్టంగా తెరకెక్కించిన పైరసీలో కాకుండా థియేటర్స్‌కు వెళ్లి చూడాలని అభిమానులకు పిలుపు నిచ్చారు. ఈ వేడక కోసం ఎంతో సేపటి నుంచి వెయిట్ చేస్తోన్న తారక్ అభిమానులకు, మెగాభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసారు. మార్చి 25న మేము పడిన కష్టానికి, శ్రమకు ఫలితం దక్కబోతుందన్నారు. ఈ సినిమా ఫలితంపై నేను జీరో ఫీలింగ్‌లో ఉన్నట్టు చెప్పారు. ఇక ఏపీ, తెలంగాణ తర్వాత తెలుగు సినిమాలకు కర్ణాటక పెద్ద మార్కెట్ అన్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్‌లో తనను భాగస్వామిని చేసినందకు రాజమౌళి మరియు అతని టీమ్ మెంబర్స్‌కు రామచరణ్ స్పెషల్ థాంక్స్ చెప్పారు.

    RRR Pre Release Event : ఆర్ఆర్ఆర్‌ను ఆ దేవుడే నిర్ణయించారు.. చిక్‌బళ్లాపూర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ఎమోషనల్..

    ఆర్ఆర్ఆర్ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో కూడా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ కావడంలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో ఈ సౌలభ్యం లేకపోవడంతో ఈ సినిమాను చూడాలనే వారికి ఇది చేదువార్తనే చెప్పోచ్చు. ఇక ఈ సినిమాను యూకేలోని ఓడియన్ బీఎఫ్ఐ ఐమ్యాక్స్ థియోటర్స్ ప్రీమియర్ షోగా ప్రదర్శించనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించనున్నట్టు తెలుస్తుంది.తాజాగా ఈ సినిమా అన్ని భాషల్లో సెన్సార్ పూర్తి చేసుకుంది.  ఇప్పటికే ప్రీ రిలీజ్ బుకింగ్స్ ద్వారానే 3 మిలియన్ డాలర్లు అందుకునే అవకాశాలున్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jr ntr, Rajamouli, Ram Charan, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు