కొమరం భీమ్‌కు అల్లూరి సీతారామరాజు బర్త్ డే విషెస్.. ఎన్టీఆర్‌తో రామ్ చరణ్ ఫోటో వైరల్..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ చేయడం అస్సలు మంచిది కాదని.. మరో రెండు మూడు నెలల తర్వాత కానీ అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రధారి ఎన్టీఆర్‌కు ఇదే సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న రామ్ చరణ్ బర్త్ డే విషెస్ తెలియజేసాడు. ఈ సందర్భంగా అతనితో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసాడు.

 • Share this:
  ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రధారి ఎన్టీఆర్‌కు ఇదే సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న రామ్ చరణ్ బర్త్ డే విషెస్ తెలియజేసాడు. ఈ సందర్భంగా అతనితో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసాడు. ఇండస్ట్రీలో నందమూరి, మెగా (కొణిదెల) వారసులైన వీళ్లిద్దరు మంచి స్నేహితులున్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు వీళ్లిద్దరు  రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. తెలుగు తెరపై  చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు టాప్ హీరోలు  కలిసి నటిస్తోన్న అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇది. ఈ చిత్రం పై తెలుగు ఇండస్ట్రీలో చాలా అంచనాలు ఉన్నాయి. పైగా బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో భారీ  అంచనాలున్నాయి. ఈ సినిమాకు తెలుగులో రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ఖరారు చేసారు. రౌద్రం రణం రుధిరం అంటే బ్రిటిష్ వాళ్లపై కోపంతో  అల్లూరి, కొమరం భీమ్ ప్రకటించిన యుద్ధంలో వాళ్లు చింధించిన రక్తం అనే అర్ధంలో ఈ సినిమా టైటిల్ పెట్టారు.

  ఎన్టీఆర్, రామ్ చరణ్, (Twitter/Photo)


  ఐతే.. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసారు. ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఏదైనా స్పెషల్ ట్రీట్ ఇద్దామనుకుంటే.. కరోనా కారణంగా ఇవ్వలేకపోయినట్టు వివరణ ఇచ్చారు. మొత్తానికి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ షేర్ చేసిన ఫోటోను ఇపుడు ఇరు హీరోల అభిమానులు సోసల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published: