RRR : ఆర్ఆర్ఆర్ సెట్‌లో ఎన్టీఆర్ మాటలకు రామ్ చరణ్ అసహనం.. వీడియో వైరల్..

ఎన్టీఆర్ మాటలకు రామ్ చరణ్ అసహనం (Twitter/Photo)

RRR : ఆర్ఆర్ఆర్ సెట్‌లో ఎన్టీఆర్ మాటలకు రామ్ చరణ్ అసహనం వ్యక్తం చేసారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

  • Share this:
    RRR : ఆర్ఆర్ఆర్ సెట్‌లో ఎన్టీఆర్ మాటలకు రామ్ చరణ్ అసహనం వ్యక్తం చేసారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఈ రోజు నుంచి ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్.. రామ్ చరణ్‌ను ఉద్దేశిస్తూ చరణ్.. డ్రమ్స్ ప్రాక్టీస్ అయిందా అంటే అక్కడ ఉన్న బల్లపై డ్రమ్స్ వాయిస్తూ అయిపోయిందంటూ కాస్త ఫన్నీగా అయిపోయినట్టు సమాధానమిచ్చారు  తారక్‌కు చెబుతాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కార్తికేయతో మాట్లాడుతూ.. రియల్ డ్రమ్స్ ఏవి.. అంటే టూ మినిట్స్ అంటూ కార్తికేయ సమాధానమిస్తాడు.ఈ సందర్భంగా చరణ్.. మాట్లాడుతూ.. కాస్ట్యూమ్స్ లేవు, ఏమి లేవు,  పొద్దునే ఇక్కడ కూర్చొబెట్టారు. దసరాకు రిలీజ్ డేట్ ఉంది అంటూ అసహనం వ్యక్తం చేశారు.

    దీనికి సంబంధించిన వీడియో ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇపుడీ వీడియో వైరల్ అవుతోంది.








    View this post on Instagram






    A post shared by RRR Movie (@rrrmovie)






    ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయానికొస్తే.  అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా ’ఆర్ఆర్ఆర్’ (Roudram Ranam Rudhiram) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు ప్రాంతానికి చెందిన చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.  ఈ సినిమాను కూడా రాజమౌళి పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పూర్వ జన్మలో స్వాతంత్య్ర పోరాటం కోసం కన్నుమూసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు ఆ తర్వాత జన్మలో ఎలా తమ స్వాతంత్య్ర కాంక్ష నెరవేర్చుకున్నారనేదే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘దోస్తీ’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    ‘దోస్తి’ సాంగ్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ (Twitter/Photo)


    ఐతే.. ఈ సినిమాను డీవివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు  నార్త్‌లో పెన్ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ సందర్భంగా పెన్ స్టూడియోస్‌ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ పార్టనర్స్‌ను అనౌన్స్ చేసారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డిజిటల్ రైట్స్‌ను జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు.

    ‘ఆర్ఆర్ఆర్’ సెట్‌లో ఐడీ కార్డులతో రాజమౌళి (Twitter/Photo)


    ఇక హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు ఇంగ్లీష్, టర్కిష్, పోర్చుగీసు, కొరియన్, స్పానిష్ భాషలకు సంబంధించిన డిజిటల్ ప్రసారాలను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది.ఈ సినిమా ఈ యేడాది అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.

    ఇవి కూడా చదవండి..

    HBD Mahesh Babu : ‘రాజ కుమారుడు’ నుంచి ‘సర్కారు వారి పాట’ వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ప్రస్థానం..

    HBD Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో టాప్ బెస్ట్ చిత్రాలు ఇవే..

    HBD Mahesh Babu -Sarkaru Vaari Paata : ’సర్కారు వారి పాట’లో మరోసారి దుమ్ము లేపిన మహేష్ బాబు.. అదిరిన సూపర్ స్టార్ స్టైలిష్ లుక్స్..

    Balakrishna - Mahesh Babu: మహేష్ బాబు కాపీ కొట్టిన బాలకృష్ణ ఈ సినిమాలు గురించి తెలుసా..
    Published by:Kiran Kumar Thanjavur
    First published: