Home /News /movies /

RRR : ఆర్‌ఆర్ఆర్ నుంచి సెకండ్ సింగిల్ నాటు నాటు పాటకు ముహూర్తం ఖరారు.. అదిరిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్..

RRR : ఆర్‌ఆర్ఆర్ నుంచి సెకండ్ సింగిల్ నాటు నాటు పాటకు ముహూర్తం ఖరారు.. అదిరిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్..

ఎన్టీఆర్, రామ్ చరణ్ , ‘నాటు నాటు సాంగ్ ((RRR Second Single Photo : Twitter)

ఎన్టీఆర్, రామ్ చరణ్ , ‘నాటు నాటు సాంగ్ ((RRR Second Single Photo : Twitter)

RRR : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అజయ్ దేవ్‌గణ్ (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ‘నాటు నాటు’ సాంగ్ ప్రోమోను విడుదల చేసారు.

ఇంకా చదవండి ...
    RRR : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అజయ్ దేవ్‌గణ్ (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది చిత్రబృందం. తాజాగా బాలీవుడ్‌లో విడుదలైన అక్షయ్ కుమార్ నటించిన ‘సూర్యవంశీ’ రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా సాధించిన వసూళ్లను చూసి ఆర్ఆర్ఆర్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

    ఇక విడుదల తేది దగ్గరపడుతుండడంతో ఓ రేంజ్‌లో ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. ఇప్పటికే దోస్తీ అంటూ ఓ సాంగ్‌ను విడుదల చేసిన చిత్రబృందం మరో సాంగ్ విడుదలకు రెడీ అయ్యింది. అందులో భాగంగా సెకండ్ సింగిల్ ’నాటు నాటు’ సాంగ్ ప్రోమోను విడుదల చేసారు. ఈ పాటను నవంబర్ 10న సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  చంద్రబోస్ రాసిన పాటకు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవా పాడారు.


    ఇక ఇటీవల ఈ సినిమా నుంచి నుంచి మోస్ట్ అవైటెడ్ గ్లింప్స్‌ను నవంబర్ 1న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేసింది చిత్రబృందం. ఓ 46 సెకండ్స్ ఉన్న ఈ గ్లింప్స్ మామూలుగా లేదు. విజువల్ వండర్‌గా ఉందని చెప్పోచ్చు. ఈ గ్లింప్స్‌లో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఎన్టీఆర్, చరణ్ మాస్ ఎంట్రీతో పాటు అజయ్ దేవగన్, అలియా లుక్స్ అదిరిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

    Balakrishna - Srinu Vaitla : బాలయ్యతో శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ సినిమా తెలుసా..

    ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు అజయ్ దేవ్‌గణ్, సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.

    Chiranjeevi : చిరంజీవికి మెగాస్టార్ బిరుదు వెనక ఇంత పెద్ద కథ ఉందా..

    ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ajay Devgn, Jr ntr, Rajamouli, Ram Charan, Roudram Ranam Rudhiram, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు