RRR: రాజమౌళి ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్‌కు ముహూర్తం ఖరారు.. గాయకులు ఎవరంటే..

RRR కోసం ఎం.ఎం.కీరవాణి ప్రమోషనల్ సాంగ్ (Twitter/Photo)

RRR: దర్శక బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.  అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా ’ఆర్ఆర్ఆర్’ (Roudram Ranam Rudhiram) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు ప్రమోషనల్ సాంగ్‌ విడుదలకు ముహూర్తం ఖరారైంది..

  • Share this:
    RRR: దర్శక బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.  అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా ’ఆర్ఆర్ఆర్’ (Roudram Ranam Rudhiram) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు ప్రాంతానికి చెందిన చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.  ఈ సినిమాను కూడా రాజమౌళి పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పూర్వ జన్మలో స్వాతంత్య్ర పోరాటం కోసం కన్నుమూసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు ఆ తర్వాత జన్మలో ఎలా తమ స్వాతంత్య్ర కాంక్ష నెరవేర్చుకున్నారనేదే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట మినహా టాకీ పార్ట్ పూర్తైయింది. దీంతో చిత్ర యూనిట్  ఈ సినిమా ప్రమోషన్ పై దృష్టి పెట్టింది.

    తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి రెడీ చేసారు. అంతేకాదు తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ థీమ్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. దానికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో ఓ ప్రమోషన్ సాంగ్‌ను అనిరుథ్ మ్యూజిక్‌లో రానున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ థీమ్ సాంగ్ వివిధ భాషల్లో వివిధ గాయకులు ఈ పాటను పాడారు. ఈ సాంగ్స్‌ను ఆగష్టు 1న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు చెప్పారు.



    ఆయా భాషల్లో ఈ పాటను అనిరుధ్ రవిచందర్, విజయ్ ఏసుదాసు, అమిత్ త్రివేది, యాజిన్ నైజర్ ఆలపించారు. ఈ సాంగ్ స్నేహం విలువను చాటి చెప్పేదిగా ఉంటుందట. ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల దోస్తిని చక్కగా చూపించనున్నారట.


    అప్పట్లో ‘షోలే’లో  ఏ దోస్తి సాంగ్ లాగా ఈ  సినిమా ఎవర్ గ్రీన్‌గా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో ఆలియా భట్, ఒలివియా మోరీస్, శ్రియ, సముద్రఖని సహా పలువురు కోలీవుడ్, మల్లూవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు నటించారు.

    కీరవాణి సంగీతంలో ప్రమోషనల్ సాంగ్ (Twitter/Photo)


    ఐతే.. ఈ సినిమాను డీవివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు  నార్త్‌లో పెన్ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ సందర్భంగా పెన్ స్టూడియోస్‌ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ పార్టనర్స్‌ను అనౌన్స్ చేసారు.

    ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డిజిటల్ రైట్స్‌ను జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు. ఇక హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు ఇంగ్లీష్, టర్కిష్, పోర్చుగీసు, కొరియన్, స్పానిష్ భాషలకు సంబంధించిన డిజిటల్ ప్రసారాలను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది.ఈ సినిమా ఈ యేడాది అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: