RRR : దర్శక బాహుబలి రాజమౌళి, రామా రావు (ఎన్టీఆర్), రామ్ చరణ్ కాంబినేషన్లో ‘ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌ను సరిగ్గా ఐదేళ్ల క్రితం 18 నవంబర్ 2017న రాజమౌళి, ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌లతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసారు. నందమూరి, మెగా హీరోలతో మల్టీస్టారర్ అనగానే టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. అంతకు ముందు రెబల్ స్టార్ ప్రభాస్‌ను ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ చేసిన రాజమౌళి .. ఆ తర్వాత ఏ హీరోతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తాడా అనేది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. జక్కన్న బాలీవుడ్ హీరోలతో తన తర్వాతి ప్రాజెక్ట్ అంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. నందమూరి, మెగా హీరోలను కేవలం తన మాటతో ఒకే సినిమాలో నటింప జేసేలా ఒప్పించారు.
ఇండస్ట్రీలో బడా హీరోలతో సినిమాలు చేయాలని అందరి దర్శకులకు ఓ కల ఉంటోంది. కానీ రిరవ్స్లో రాజమౌళితో సినిమా చేయడానికి అగ్ర హీరోలను తన చుట్టూ క్యూ కట్టేలా చేసి నిజంగానే దర్శక బాహుబలిగా నిలిచారు. ఇక రాజమౌళి నుంచి పిలుపు రావడంతోనే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కథ వినకుండా ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. జక్కన్న తమతో సినిమా చేయడమే తమ భాగ్యంగా భావించే స్థితిలో టాలీవుడ్ అగ్ర హీరోలున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రకటించి ఐదేళ్లు అయిన సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్‌గా ఓ ట్వీట్ చేసింది.
...........................???? pic.twitter.com/oFfTkOLLcT
— rajamouli ss (@ssrajamouli) November 18, 2017
ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల స్టార్డమ్ వెనక రాజమౌళి సింహాద్రి, మగధీర సినిమాలే కీ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే కదా. ముందుగా ఈ సినిమాను 2020 జూలై 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కరోనా మహామ్మారి విజృంభనతో ఈ సినిమా షూటింగ్ లేట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాను 8 జనవరి 2021 న మరోసారి రిలీజ్ డేట్ మార్చారు.
ఇక అప్పటికీ కరోనా కెేసులు తగ్గకపోవడంతో పాటు షూటింగ్ లేట్ కావడంతో ఈ సినిమాను 13 అక్టోబర్ 2021 దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే మూడు రిలీజ్ డేట్లు ఛేంజ్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు 7 జనవరి 2022న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అపుడు కరోనా సెకండ్ వేవ్ ఉదృతి పెరగడంతో ఈ సినిమాను మార్చి 25న 2022న విడుదలై సంచలన విజయం సాధించింది. దాదాపు ఈ సినిమా రూ. 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్‌గా బాప్‌గా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. ఇక ఈ సినిమా రీసెంట్గా జపాన్ దేశంలో జపనీస్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.అంతేకాదు ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ ఉంటుందనే విసయాన్ని కూడా ప్రస్తావించారు.
మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ ఎన్నో ఆటూ పోట్లను ఎదుర్కొని ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ కెరీర్లో తొలిసారి.. వరుసగా 2019, 2020, 2021 మూడు కాలండర్ ఇయర్స్‌లో సినిమా విడుదల కాకపోవడం.. మరోవైపు రామ్ చరణ్‌కు 2020,2021లో ఏ సినిమా విడుదలకు నోచుకోకపోవడం ‘ఆర్ఆర్ఆర్’ ప్రత్యేకత అనే చెప్పాలి. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో హీరోగా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో మెప్పించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Rajamouli, Ram Charan, Roudram Ranam Rudhiram, RRR, Tollywood