Home /News /movies /

RRR : ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్ మొదలై నేటికీ నాలుగేళ్లు పూర్తి.. మూవీ యూనిట్ ఆసక్తికర పోస్ట్..

RRR : ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్ మొదలై నేటికీ నాలుగేళ్లు పూర్తి.. మూవీ యూనిట్ ఆసక్తికర పోస్ట్..

‘ఆర్ఆర్ఆర్’ మొదలై నేటికి నాలుగేళ్లు పూర్తి (Twitter/Photo)

‘ఆర్ఆర్ఆర్’ మొదలై నేటికి నాలుగేళ్లు పూర్తి (Twitter/Photo)

RRR : దర్శక బాహుబలి బాహుబలి రాజమౌళి, రామా రావు (ఎన్టీఆర్), రామ్ చరణ్ కాంబినేషన్‌లో ‘ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌ను సరిగ్గా నాలుగేళ్ల క్రితం 18 నవంబర్ 2017న రాజమౌళి, ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌లతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఓ ట్వీట్ చేసింది.

ఇంకా చదవండి ...
    RRR : దర్శక  బాహుబలి రాజమౌళి, రామా రావు (ఎన్టీఆర్), రామ్ చరణ్ కాంబినేషన్‌లో ‘ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌ను సరిగ్గా నాలుగేళ్ల క్రితం 18 నవంబర్ 2017న రాజమౌళి, ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌లతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసారు. నందమూరి, మెగా హీరోలతో మల్టీస్టారర్ అనగానే టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. అంతకు ముందు రెబల్ స్టార్ ప్రభాస్‌ను ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్‌ చేసిన రాజమౌళి .. ఆ తర్వాత ఏ హీరోతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తాడా అనేది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.  జక్కన్న బాలీవుడ్ హీరోలతో తన తర్వాతి ప్రాజెక్ట్ అంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. నందమూరి, మెగా హీరోలను కేవలం తన మాటతో ఒకే సినిమాలో నటింప జేసేలా ఒప్పించారు.

    ఇండస్ట్రీలో బడా హీరోలతో సినిమాలు చేయాలని అందరి దర్శకులకు ఓ కల ఉంటోంది. కానీ రిరవ్స్‌లో  రాజమౌళితో సినిమా చేయడానికి అగ్ర హీరోలను తన చుట్టూ క్యూ కట్టేలా చేసి నిజంగానే దర్శక బాహుబలిగా నిలిచారు. ఇక రాజమౌళి నుంచి పిలుపు రావడంతోనే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కథ వినకుండా ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. జక్కన్న తమతో సినిమా చేయడమే తమ భాగ్యంగా భావించే స్థితిలో టాలీవుడ్ అగ్ర హీరోలున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రకటించి నాలుగేళ్లు అయిన సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్‌గా ఓ ట్వీట్ చేసింది.


    ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల స్టార్‌డమ్ వెనక రాజమౌళి సింహాద్రి, మగధీర సినిమాలే కీ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే కదా. ముందుగా ఈ సినిమాను 2020 జూలై 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కరోనా మహామ్మారి విజృంభనతో ఈ సినిమా షూటింగ్ లేట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాను 8 జనవరి 2021 న మరోసారి రిలీజ్ డేట్ మార్చారు.

    Krithi Shetty : బంగార్రాజులో ‘నాగ లక్ష్మి’గా కృతి శెట్టి.. అదిరిన బేబమ్మ కొత్త లుక్..

    ఇక అప్పటికీ కరోనా కెేసులు తగ్గకపోవడంతో పాటు షూటింగ్ లేట్ కావడంతో ఈ సినిమాను 13 అక్టోబర్ 2021 దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే మూడు రిలీజ్ డేట్లు ఛేంజ్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు 7 జనవరి 2022న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఒక వారం ముందు థియేటర్స్‌లో విడుదల కానుంది. 2022లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో సినిమాల జాతర మొదలు కానుంది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ పై అధికారిక ప్రకటన విడుదలైన 4 యేళ్ల తర్వాత 4వ రిలీజ్‌ డేట్‌కు ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కావడం విశేషం. ఈ రోజు నుంచి సరిగ్గా 50వ రోజు ‘ఆర్ఆర్ఆర్’ ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా విడుదల కానుంది.

    Akhanda : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలకృష్ణ ‘అఖండ’ ఫోటోస్..


    మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ ఎన్నో ఆటూ పోట్లను ఎదుర్కొని ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ కెరీర్‌లో తొలిసారి.. వరుసగా 2019, 2020, 2021 మూడు కాలండర్ ఇయర్స్‌లో సినిమా విడుదల కాకపోవడం.. మరోవైపు రామ్ చరణ్‌కు 2020,2021లో ఏ సినిమా విడుదలకు నోచుకోకపోవడం ‘ఆర్ఆర్ఆర్’ ప్రత్యేకత అనే  చెప్పాలి. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో హీరోగా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించనున్నారు. .
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ajay Devgn, Bollywood news, Jr ntr, Nandamuri Rama Rao, Rajamouli, Ram Charan, Roudram Ranam Rudhiram, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు