RRR OTT Trailer | ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ఓటీటీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందింది. అంతేకాదు ఈ సినిమా తెలుగులో పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆర్ఆర్ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్‌లో అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 14 మిలియన్ డాలర్స్‌పైగా వసూలు చేసి రూ. 100 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. అయితే అమెరికాలో ఈ ఫీట్ సాథించిన మరో సినిమా బాహుబలి 2 (Bahubali).. ఇండియా నుంచి ఈ రెండు సినిమాలు అమెరికాలో 100 కోట్ల గ్రాస్‌ను అందుకున్నాయి.
ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ రెండు సినిమాలు కూడా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చినవే. ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించి ఈ సినిమా ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తోంది.ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళీ, కన్నడ భాషాల్లో ఈ నెల 20 నుంచి జీ5 ప్రీమియంలో స్ట్రీమింగ్ కానుంది అక్కడ. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు రెండు రోజులు ముందు విడుదలైతే.. ఆర్ఆర్ఆర్ ఓటీటీ మాత్రం ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 20న విడుదల కాబోతుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ ఓటీటీ సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఇక్కడ మరో విషయం ఏమంటే ఇది ప్రీమియం కాబట్టి.. పే ఫర్ వ్యూ పద్దతినా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. హిందీ వెర్షన్ ఓటీటీలోకి కాస్తా లేటుగా రాబోతుందట. సౌత్ వెర్షన్‌లు మాత్రం మే 25న వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో పాటు అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు.
ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో పాట విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాటు నాటు, కొమ్మ ఉయ్యాల, కొమరం భీముడో వంటి పాటలు విడుదలై యూట్యూబ్‌లో కేక పెట్టిస్తోండగా.. మరో పాట దోస్తీ విడుదలైంది. ఈ పాటను సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాయగా.. హేమచంద్ర పాడారు. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా 49 రోజుల్లో రూ. 610 కోట్ల షేర్ వరకు రాబట్టింది. ఓవరాల్‌గా రూ. 1134 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగింపుకు వచ్చింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.