• Home
 • »
 • News
 • »
 • movies
 • »
 • RRR RAJAMOULI NTR TEASER RELEASE DATE FIX HERE ARE THE DETAILS TA

RRR ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. తారక్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన రాజమౌళి..

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ లుక్ (Fan Made/Poster)

RRR Rajamouli Jr NTR Komaram bheem Look |ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ చేసాడు. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయినట్టు సమాచారం.

 • Share this:
  RRR | ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ చేసాడు.  ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నట్టు ఇప్పటికే రాజమౌళి తెలిపారు. ఇక తెలుగు తెరపై  చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు బడా మాస్ హీరోలు  కలిసి నటిస్తోన్న అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇది. ఈ చిత్రం పై తెలుగు ఇండస్ట్రీలో చాలా అంచనాలు ఉన్నాయి. పైగా బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో అంచనాలున్నాయి. ఈ సినిమాకు తెలుగులో రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమాలో ఇప్పటికే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ గెటప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ (Twitter/Photo)


  ఇక ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఏదైనా టీజర్ వస్తుందని ఆశించిన ప్రేక్షకులకు మాత్రం నిరాశే మిగిలింది. అప్పటికే దేశంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో తారక్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయలేకపోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో షూటింగ్ ప్రారంభించాలనుకున్నారు. కొంత మంది డూప్‌తో ట్రయల్ షూట్ చేద్దామనుకున్నారు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఆ తరాత రాజమౌళితో పాటు, నిర్మాత దానయ్యకు కరోనా రావడంతో మరింత ఆలస్యం అయింది. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే నెల నుంచి మొదలు పెట్టనున్నారు.

  ట్రిపుల్ ఆర్ షూటింగ్ (RRR movie unit)
  ట్రిపుల్ ఆర్ షూటింగ్ (RRR movie unit)


  ఎన్టీఆర్, చరణ్ కాకుండా మిగతా నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చేసిన పార్ట్‌కు సంబంధించి ఎడిటింగ్ మొదలు పెట్టాడు రాజమౌళి. ఈ సందర్భంగా దసరాకు ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే టీజర్ కట్ చేసినట్టు సమాచారం. కీరవాణి ఇప్పటికే ఈ టీజర్‌కు ఆర్ఆర్ సమకూర్చే పనిలో ఉన్నాడు. ఇప్పటికే కీరవాణి ఇచ్చిన ఆర్ఆర్ పై జక్కన్న అంత సంతృప్తిగా లేడట. అందుకే లేటైనా పర్వాలేదు.. టీజర్ అదిరిపోయేలా ఉండాలని అన్న కీరవాణికి చెప్పినట్టు సమాచారం. కీరవాణి కూడా అదే పనిలో ఉన్నాడట.  ఇక దీపావళికి అజయ్ దేవ్‌గణ్ పాత్రకు సంబంధించిన మరో టీజర్‌ను బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేయనున్నారు. మొత్తంగా ఎన్ని రోజులుగా కొమరం భీమ్‌గా తారక్‌ను చూడాలనుకున్న అభిమానులు కల త్వరలో నెరవేరబోతున్నదన్నమాట.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: