Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    RRR Movie Update: ఆర్ఆర్ఆర్ లేటెస్ట్ అప్‌డేట్.. తారక్ టీజర్‌‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన రాజమౌళి..

    RRR Update Shooting Starts  | ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా  ‘రౌద్రం రణం రుధిరం’ ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ చేసాడు. రాజమౌళి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు ఓ వీడియో విడుదల చేసాడు. అందులోనే కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ లుక్ ఎపుడు విడుదల చేసేది చెప్పాడు.

    news18-telugu
    Updated: October 6, 2020, 11:24 AM IST
    RRR Movie Update: ఆర్ఆర్ఆర్ లేటెస్ట్ అప్‌డేట్.. తారక్ టీజర్‌‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన రాజమౌళి..
    ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ రాజమౌళి (Twitter/Photo)
    • Share this:
    RRR Shooting Starts  | ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా  ‘రౌద్రం రణం రుధిరం’ ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ చేసాడు.  ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నట్టు ఇప్పటికే రాజమౌళి తెలియజేసారు. ఇక తెలుగు తెరపై  చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు బడా మాస్ హీరోలు  కలిసి నటిస్తోన్న అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇది. ఈ చిత్రం పై తెలుగు ఇండస్ట్రీలో చాలా అంచనాలు ఉన్నాయి. పైగా బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో అంచనాలున్నాయి. ఇప్పటికే  విడుదలైన రామ్  చరణ్‌ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా రాజమౌళి దాదాపు ఏడు నెలల లాంగ్ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఈ టెస్ట్ షూట్ చేసారు. దాంతో అంతా సేఫ్ అని భావించి.. నిన్ననే ఓ ట్రయల్ షూట్ నిర్వహించి వీ ఆర్ బ్యాక్ అంటూ చెప్పాడు.

    దాదాపు ఏడు నెలల నుంచి షూటింగ్ స్పాట్ అలాగే ఉంది. దీంతో షూటింగ్ జరిగే ప్రదేశాన్ని శానిటైజ్ చేసి దుమ్ము దులిపే పనిలో పడ్డారు. నిన్న అన్ని సెట్ చేసుకొని ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాడు. దర్శకుడు రాజమౌళి. అల్యూమీనియం ఫ్యాక్టరీలోనే ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి మొదలు పెట్టాడు జక్కన్న. ఇక కొమరం భీమ్‌గా తారక్.. టీజర్.. ఈ నెల 22న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ లేటెస్ట్ అప్‌డేట్‌  రావడంతో అటు నందమూరి.. ఇటు మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
    Published by: Kiran Kumar Thanjavur
    First published: October 6, 2020, 10:38 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading