RRR లో రాజమౌళి కథ, విజువల్స్‌తో పాటు వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడట..

ప్రస్తుతం రాజమౌళి..ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ‘RRR’ వర్కింగ్‌ టైటిల్‌తో భారీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ నడుస్తోంది. 300 కోట్ల‌తో ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్నాడు దాన‌య్య‌. తాజాగా ఈ సినిమాలో రాజమౌళి కథ, విజువల్స్‌తో పాటు డైలాగులకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 7, 2019, 8:06 PM IST
RRR లో రాజమౌళి కథ, విజువల్స్‌తో పాటు వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడట..
రాజమౌళితో తారక్, రామ్ చరణ్
  • Share this:
ప్రస్తుతం రాజమౌళి..ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ‘RRR’ వర్కింగ్‌ టైటిల్‌తో భారీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ నడుస్తోంది. 300 కోట్ల‌తో ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్నాడు దాన‌య్య‌.  ఈ సినిమాను పీరియడ్ డ్రామాగా, బ్రిటిష్ కాలంలో జరిగిన కథతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో ఎన్టీఆర్ పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయని చెబుతున్నారు. ఈ సినిమాలో తారక్ బందిపోటు పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. మరోవైపు రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు  ఈ సినిమా కోసం రాజమౌళి కథ విషయంతో పాటు డైలాగుల విషయంలో ఫుల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అప్పట్లో ‘యమదొంగ’ సినిమాలో ఎన్టీఆర్ చెప్పించినట్లు ఈ సినిమాలో కూడా తారక్‌తో పవర్‌ఫుల్ డైలాగులు చెప్పించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా కూడా తన  బుర్రకు పదను పెట్టి మరి ఈ సినిమా కోసం అద్భుతమైన డైలాగులు రాస్తున్నాడట. ముఖ్యంగా  ఈసినిమాలో ఎన్టీఆర్ చెప్పే డైలాగులకు థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే అంటున్నారు జక్కన్న సన్నిహిత వర్గాలు.

RRR.. Rajamouli Main Focus on NTR,Ram charan Charecters And alos Script and dialogues, ప్రస్తుతం రాజమౌళి..ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ‘RRR’ వర్కింగ్‌ టైటిల్‌తో భారీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ నడుస్తోంది. 300 కోట్ల‌తో ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్నాడు దాన‌య్య‌. తాజాగా ఈ సినిమాలో రాజమౌళి కథ, విజువల్స్‌తో పాటు డైలాగులకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. Ram Charan Ntr,RRR movie, RRR Movie NTR Dialogues main Highlights, RRR dialogues high light, RRR NTR six pack body, RRR movie NTR Charecter in two shades,maha shivarathri 2019, shiva rathri, ram charan ntr rajamouli,Rajamouli Ruling RRR,rrr multistarrer,రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్, డైలాగులకు ఎక్కువ ప్రాధాన్యత, డైాలాగులకు ఎక్కువ ప్రాధాన్యత, ఆర్ఆర్ఆర్ లో కథతో పాటు డైలాగులకు ప్రాధాన్యత, వైవిధ్య పాత్రల్లో ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్,చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి,ట్రిపుల్ ఆర్,మల్టీస్టారర్,
RRR పోస్టర్


సాధారణంగా రాజమౌళి ఏ సినిమా తీసిన విజువల్ పరంగా ఎక్కువగా ప్రాధాన్యత  ఇస్తుంటాడు. కానీ RRR విషయంలో డైలాగులపై ఎక్కువగా ఫోకస్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నాడు. మరోవైపు రామ్ చరణ్ గెటప్ కూడా ఈ  సినిమాకు  హైలెట్ అని చెబుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీలు ఆలియా భట్, సోనాక్షి సిన్హాలను హీరోయిన్స్‌గా అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్‌కు  కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సమ్మర్ కానుకగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు మిగతా భారతీయ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు.
First published: March 7, 2019, 8:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading