Home /News /movies /

RRR RAJAMOULI JR NTR RAM CHARANS RRR MOVIE IN TROUBLES STUDENT FILE PIL AGAINST RRR MOVIE IN TELANGANA HIGH COURT TA

RRR : చిక్కుల్లో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ.. హైకోర్టును ఆశ్రయించిన యువతి..

ఆర్ఆర్ఆర్ మూవీపై హైకోర్టులో పిల్ (File/Photo)

ఆర్ఆర్ఆర్ మూవీపై హైకోర్టులో పిల్ (File/Photo)

RRR : RRR సినిమా రాజమౌళి, రాంచరణ్, తారక్ లు పడ్డ నాలుగేళ్ల కష్టం. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు జనవరి 7న మాత్రం రిలీజ్ అవుతుందని అంతా ఊహించారు. అంతేకాదు RRR రిలీజ్ ఇఫ్పటికే మూడు సార్లు వాయిదా పడింది. తాజాగా నాలుగో సారి కూడా వాయిదా పడింది. తాజాగా ఈ మూవీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఓ యువతి హైకోర్టులో పిల్ దాఖలు చేసింది.

ఇంకా చదవండి ...
  RRR :చిక్కుల్లో రాజమౌళిఆర్ఆర్ఆర్’ మూవీ.. హైకోర్టును ఆశ్రయించిన యువతి.. వివరాల్లోకి వెళితే.. RRR సినిమా రాజమౌళి (Rajamouli), ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్(Ram Charan) లు పడ్డ నాలుగేళ్ల కష్టం. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు జనవరి 7న మాత్రం రిలీజ్ అవుతుందని అంతా ఊహించారు. అంతేకాదు RRR రిలీజ్ ఇఫ్పటికే మూడు సార్లు వాయిదా పడింది. తాజాగా నాలుగో సారి కూడా వాయిదా పడింది. కానీ జనవరి 7న మాత్రం కచ్చితంగా రిలీజ్ అవుతుందని భావించిన అటు రాజమౌళి అండ్ టీం కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసింది. దాదాపు ప్రమోషన్స్ కోసం స్పెషల్‌గా ఓ ఫ్లైట్‌ను ఏర్పాటు చేసుకొని దేశంలోని ముఖ్యనగరాలైన కొచ్చి, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఎంతో అట్టహాసంగా ఈ మూవీ ప్రమోషన్స్ చేశారు.

  దీని కోసం ఏకంగా రూ. 40 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. అయితే రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో RRR సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్. దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులంతా ఉసూరుమన్నారు.  గతంలో రెండు సార్లు వాయిదా పడ్డప్పటికీ, అఖండ, పుష్ప ఇచ్చిన జోష్ తో సంక్రాంతి సెలవల నేపథ్యంలో  జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామన్న ధీమాతో RRR మూవీ ప్రమోషన్ భారీగా చేసేశారు.  ఆయా నగరాల్లో చేసిన ఈవెంట్స్ కు RRR యూనిట్ అంతా తరలివెళ్లింది. అటు హీరోయిన్ ఆలియా భట్ సైతం ప్రమోషన్స్ లో పాల్గొంది.

  బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ మరో రికార్డు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

  షూటంగ్ సమయంలో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల షెడ్యూల్స్ క్యాన్సిల్ అవుతూనే వచ్చింది. మొత్తానికి ఎలాగోలా సినిమాను పూర్తి చేశారు. వరుసగా ఏడాది నుంచి సినిమా రిలీజ్ వార్తలు వస్తున్నా, జనవరి 7న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ ఈ సారి ఒమిక్రాన్ దెబ్బ కొట్టేసింది. ఒమిక్రాన్ ప్రభావంతో ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పడింది. రాజమౌళి ప్లానింగ్‌ కు కరోనా దెబ్బ వేయడంతో,   ఎప్పటికప్పుడు బెడిసి కొడుతూనే ఉంది.

  Theatres : ఒక్క క్లిక్ తో మీరు సినిమా థీయేట‌ర్‌నే బుక్ చేసుకోవ‌చ్చు.. న‌యా ఐడియాతో ముందుకొచ్చిన హైద‌రాబాద్ సంస్థ‌..


  తాజాగా ఈ సినిమాపై హైదాబాద్ హైకోర్టులో ఏపీలోని పశ్చిమ గోదావరి ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య కోర్టులో ఈ పిల్ (PIL) దాఖలు చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించారు. ఇందులో చారిత్రక యోధుల పాత్రలను రాజమౌళి వక్రీకరించి చిత్రీకరించారని ప్రధానంగా తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. మహనీయుల అసలు చరిత్ర కాకుండా... కాల్పనిక కథతో సినిమా తెరకెక్కించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

  Ram Charan : RRR తర్వాత తగ్గేదేలే అంటున్న రామ్ చరణ్.. చెర్రీ లిస్టులో పెరుగుతోన్న క్రేజీ డైరెక్టర్స్ లిస్ట్..

  దీంతో ఈ సినిమాకు ఇప్పటికే జారీ చేసిన సెన్సార్ సర్టిఫికేట్‌‌ను రద్దు చేయడంతో పాటు సినిమా విడుదలను నిలిపివేయాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అల్లూరి వంశానికి చెందిన సౌమ్య దాఖలు చేసింది. కొమరం భీమ్, అల్లూరి వంటి యోధుల జీవితాలకు వ్యతిరేకంగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారని ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు.. బ్రిటిష్ వారి దగ్గర పోలీస్ అధికారికగా పనిచేయడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అంతేకాదు ఇందులో ప్రతివాదులుగా సెన్సార్ బోర్డ్, చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య, డైరెక్టర్ రాజమౌళి, రచయత విజయేంద్ర ప్రసాద్ లను చేర్చారు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని  ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Jr ntr, Rajamouli, Ram Charan, RRR, Telangana High Court, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు