RRR : ఆర్ఆర్ఆర్ రాజమౌళి (Rajamouli) డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan) వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా కేజీఎఫ్ రాకతో దాదాపు థియేట్రికల్ రన్ క్లోజింగ్ వచ్చిందనే చెప్పాలి. ఆచార్య తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మాయ చేస్తుందనేది చూడాలి. ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా ఈ సినిమా రూ. 1114 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో పాటు రూ. 600 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. ఈ సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. ముఖ్యంగా తెలంగాణతో పాటు హిందీ బెల్ట్‌లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమా క్లోజింగ్‌కు రావడంతో ఈ సినిమాలోని ఒక్కో పాటను విడుదల చేస్తున్నారు. నిన్ననే ఈ సినిమా నుంచి ఎత్తర జెండా ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేసారు. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి మొత్తం పాటల Jukeboxను విడుదల చేసారు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది.ఆలియా భట్, ఒలివియా మోరీస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఈ యేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
#RRRmovie Audio Jukebox Out Now
Listen here ▶️ https://t.co/y1srTeyRr1#RRR audio on @laharimusic @tseries@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @mmkeeravaani @aliaa08 @OliviaMorris891 @DVVMovies @RRRMovie pic.twitter.com/r4EbrEln7t
— BA Raju's Team (@baraju_SuperHit) April 27, 2022
నైజాం (తెలంగాణ): రూ. 110.71 కోట్లు /రూ . 70 కోట్లు
సీడెడ్ (రాయలసీమ): రూ. 50.57 కోట్లు / రూ. 37 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 34.61 కోట్లు / రూ. 22 కోట్లు
ఈస్ట్: రూ. 16.04 కోట్లు / రూ. 14 కోట్లు
వెస్ట్: రూ. 13.12 కోట్లు /రూ. 12 కోట్లు
గుంటూరు: రూ. 17.97 కోట్లు / రూ. 15 కోట్లు
కృష్ణా:రూ. 14.49 కోట్లు / రూ. 13 కోట్లు
నెల్లూరు: రూ. 9.25 కోట్లు / రూ. 8 కోట్లు
Telagana - AP : రూ. 266.76 కోట్లు (రూ. 403.20 కోట్లు గ్రాస్ ) వసూళ్లను రాబట్టింది. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 266.76 కోట్లు (రూ. 403.20 కోట్లు గ్రాస్)/ (టోటల్ తెలంగాణ+ఏపీ బిజినెస్ రూ. 191 కోట్లు) ముందుగా రూ. 211 కోట్లకు అమ్మారు. కొన్ని ఏరియాల్లో తగ్గించిన తర్వాత రూ. 191కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది.
కర్ణాటక: రూ. 43.64 కోట్లు / రూ. 41 కోట్లు
తమిళనాడు: రూ. 38.08 కోట్లు / రూ. 35 కోట్లు
కేరళ: 10.48 కోట్లు / రూ. 9 కోట్లు
హిందీ: 131.00 కోట్లు / రూ. 92 కోట్లు
రెస్టాఫ్ భారత్ : రూ.9.13 కోట్లు / రూ. 8 కోట్లు
ఓవర్సీస్: రూ. 101.05 కోట్లు / రూ. 75 కోట్లు)
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :రూ. 600.14 కోట్లు షేర్ (రూ.1114.00 కోట్ల గ్రాస్) / (ఆర్ఆర్ఆర్ టోటల్ వాల్డ్ వైడ్ బిజినెస్ రూ.. 451 కోట్లు)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ram Charan, Roudram Ranam Rudhiram, RRR, Tollywood