RRR RAJAMOULI JR NTR RAM CHARAN RRR MOVIE RELEASE ON APRIL 28 DUE TO PUNEETH RAJKUMAR JAMES RELEASE EFFECT IN KARNATAKA TA
RRR : ఆ హీరో ఎఫెక్ట్ .. రాజమౌళి ఆర్ఆర్ఆర్ విడుదలయ్యేది ఆరోజే..
ఆర్ఆర్ఆర్ విడుదల (Twitter/Photo)
RRR | ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను ఆ రోజు రిలీజ్ చేయడం ఖాయం అయింది.
ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కరోనా కారణంగా మరోసారి వాయిదా పడింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అనేక రాష్ట్రాలు థియేటర్స్‌ను మూసివేస్తున్న నేపథ్యంలో తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆ మధ్య ప్రకటించింది. దీంతో జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా తప్పని పరిస్థితుల్లో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా కోసం రెండు తేదీలను లాక్ చేసిందీ టీమ్. దీనికి సంబంధించి మేకర్స్ అధికారికంగా ఒక నోట్‌ను విడుదల చేసారు.
కరోనా మహమ్మారి తగ్గి పరిస్థితి మెరుగ్గా ఉండి.. థియేటర్లు 100% కెపాసిటీతో రన్ అయితే ఈ సినిమా మార్చి 18న విడుదల అవుతుందని.. లేకపోతే.. ఏప్రిల్ 28 న థియేటర్లలో విడుదల అవుతుందని తెలిపింది. కానీ మార్చి 18న ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో విడుదలయ్యేలా లేదు. ఎందుకంటే.. మార్చి 17న కన్నడ పవర్ స్టార్ స్వర్గీయ పునీత్ రాజ్‌కుమార్ నటించిన ‘జేమ్స్’ మూవీ విడుదల కానుంది.
రిపబ్లిక్ డే కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ చిత్రంలో పునీత్ వీర సైనికుడి పాత్రలో నటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా పునీత్ అభిమానులు ఆయన ఫోటోకు పాలాభిషేకాలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు ఈ సినిమా పై కన్నడ ప్రేక్షకులతో పాటు మిగతా ఇండస్ట్రీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పునీత్ రాజ్‌కుమార్ ‘జేమ్స్’ మూవీ (Twitter/Photo)
దీంతో కర్ణాటకలోని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ.. పునీత్ రాజ్‌కుమార్ నివాళిగా వస్తోన్న ఈ సినిమాను కర్ణాటకలోని అన్ని థియేటర్స్‌లో నడిపించాలని తీర్మానించారు. ఈ నేపథ్యంలో అపుడు రిలీజయ్యే ఏ సినిమాను కర్ణాటకలో ఉన్న థియేటర్స్‌లో ఆ వారం రోజుల పాటు వేరే ఏ సినిమా విడుదల చేయబోమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్చి 18న ఆర్ఆర్ఆర్ అక్కడ విడుదల చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాను ఖచ్చితంగా ఏప్రిల్ 28న విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ కారణంగా మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ఎఫ్ 3 సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయి. దీంతో ప్రస్తుతం సంక్రాంతి బరిలో బంగార్రాజు మినహా అన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటించారు. మరోవైపు ఈ చిత్రం ఓటిటి రిలీజ్ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు.
ఆర్ఆర్ఆర్ (File/Photo)
ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చింది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది.
సిరివెన్నెల సీతరామశాస్త్రి రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు. ఈ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.