Home /News /movies /

RRR RAJAMOULI JR NTR RAM CHARAN RRR MOVIE BREAKS ANOTHER RARE RECORD IN NIZAM AREA HERE ARE THE DETAILS TA

RRR : ‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. మళ్లీ బ్రేక్ చేయాలంటే రాజమౌళి రావాలేమో..

రాజమౌళి ఆర్ఆర్ఆర్ మరో అరుదైన రికార్డ్ (RRR Collections)

రాజమౌళి ఆర్ఆర్ఆర్ మరో అరుదైన రికార్డ్ (RRR Collections)

RRR Nizam Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి  (Rajamouli) డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని  నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. తాజాగా ఈ సినిమా తెలంగాణ గడ్డపై మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.

ఇంకా చదవండి ...
    RRR Nizam Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి  (Rajamouli) డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని  నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan)  వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీగా మొదటి రోజురికార్డు బ్రేక్  వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు. ఇక ఈ సినిమా నైజాం (తెలంగాణ)లో రికార్డు స్థాయిలో బిజినెస్ క్రియేట్ చేసింది. తాజాగా ఇక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించడమే కాకుండా.. బ్రేక్ ఈవెన్‌ అయింది. తెలుగు సినిమాల విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ) మార్కెట్ (Nizam Market) చాలా పెద్దది. ఒకప్పుడు ఇక్కడ రూ.  10 కోట్ల షేర్ మార్క్ అందుకుంటే వామ్మో అనుకునే వాళ్ళు. కేవలం చిరంజీవి వంటి  సినిమాలు మాత్రమే ఎక్కువగా రూ.  10 కోట్ల మార్కును అందుకునేవి.

    ఆ తర్వాత మెల్లమెల్లగా మహేష్ బాబు (Mahesh Babu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan), ప్రభాస్ (Prabhas) లాంటి హీరోలు కూడా నైజాంలో తమకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకున్నారు. మరీ ముఖ్యంగా గత కొంతకాలంగా నైజాంలో తెలుగు సినిమాలు అత్యధిక వసూళ్లు సాధిస్తున్నాయి. ఒకప్పుడు రూ. 10 కోట్లు ఫుల్ రన్‌లో వస్తే గొప్ప అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్క రోజులోనే రూ. 10 కోట్లు వచ్చేస్తున్నాయి. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా అయితే ఏకంగా మొదటి రోజు  రూ. 25 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత కూడా అదే జోరు కంటిన్యూ చేస్తోంది ఈ సినిమా. నైజాంలో ఈ సినిమాను 70 కోట్లకు కొంటే ట్రేడ్ సైతం ఆశ్చర్య పోయింది.

    మొదటి రోజు :  రూ. 23.35 కోట్లు
    రెండో రోజు : రూ.15.10 కోట్లు
    మూడో రోజు : రూ. 15.05 కోట్లు
    నాలుగో రోజు : రూ. 8.15 కోట్లు
    ఐదో రోజు : రూ. 6.70 కోట్లు
    ఆరో రోజు :రూ. 4.80 కోట్లు
    ఏడో రోజు : రూ.4.07 కోట్లు
    ఎనిమిదో రోజు : రూ. 4.31 కోట్లు
    తొమ్మిదో రోజు : రూ. 8.57 కోట్లు
    పదో రోజు : రూ. 6.96 కోట్లు
    పదకొండో రోజు :రూ. 2.18 కోట్లు
    పన్నెండో రోజు : రూ.2.12 కోట్లు
    నైజాం పన్నెండు రోజుల కలెక్షన్లు.. రూ. 101.36 కోట్లు..

    Samantha : విడాకుల తర్వాత నాగ చైతన్యను తొలిసారి ఈ రకంగా గుర్తు చేసుకున్న సమంత..


    ఇన్ని డబ్బులు బాక్సాఫీస్ దగ్గర రాబట్టాలంటే ఎంతమంది సినిమా చూడాలి.. ఎన్నిరోజులు లాంగ్ రన్ ఉండాలి అంటూ లెక్కలు వేసుకున్నారు. కానీ ఆరు రోజులు ముగిసేసరికి నైజాం గడ్డపై ఏకంగా రూ. 70 కోట్లకు పైగా  షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని  నయా చరిత్ర సృష్టించింది త్రిబుల్ ఆర్ సినిమా. అసలు కలలో కూడా ఊహించని విధంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ కురుస్తుంది.  తాజాగా ఈ సినిమా నైజాంలో మరో అరుదైన రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా నైజాం (తెలంగాణ)లో 12వ రోజు రూ. 2.12 కోట్లు కలెక్ట్ చేసింది. టోటల్ 12 రోజుల  కలెక్షన్స్ కలిపితే రూ. 101.36 కోట్లకు పైగా షేర్ రాబట్టి నయా రికార్డు క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా రూ. 200 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇప్పట్లో ఏ తెలుగు సినిమా ఈ రికార్డును బ్రేక్ చేయడం అంత ఈజీగా కాదు. మళ్లీ రాజమౌళి రంగంలోకి దిగితేనే సాధ్యం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

    Raghavendra Rao - Rajamouli: రాజమౌళి సహా రాఘవేంద్రరావు దగ్గర శిష్యరికం చేసిన టాలీవుడ్ టాప్ దర్శకులు వీళ్లే..


    తెలంగాణలో (ఆర్ఆర్ఆర్) రౌద్రం రణం రుధిరం సినిమా రూ. 70 కోట్ల బిజినెస్ చేసింది. రూ. 75 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగింది. బ్రేక్‌ ఈవెన్‌ అయింది. అంతేకాదు.. నైజాంలో మొదటి రూ. 75 కోట్లు షేర్ సాధించిన సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత వరుసగా రూ. 80 కోట్లు.. రూ. 90 కోట్లు.. తాజాగా రూ. 100 కోట్ల షేర్ రాబట్టి తెలంగాణ గడ్డపై నయా రికార్డు తన పేరున లిఖించుకుంది. అసలు కలలో కూడా ఈ రికార్డు ఈ మధ్య కాలంలో మరో సినిమాకు సాధ్యం కావడం కష్టమే. బాహుబలి 2 అనుకుంటే.. దాన్ని మించిపోయేలా కలెక్షన్లు వస్తున్నాయి ఈ చిత్రానికి. మొన్న శని, ఆది వారాలు ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది. వీక్ డేస్‌లో కాస్త వెనకబడింది.  జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలో ఉండటం.. ఇద్దరికి అదిరిపోయే మార్కెట్ ఉండటం.. దానికి తోడు రాజమౌళి అనే బ్రాండ్ సినిమాకు మరింత హెల్ప్ అవుతుంది. బాహుబలి 2 సినిమాకు ఐదేళ్ల కింద నైజాంలో రూ.  66.63 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు దాన్ని చాలా పెద్ద మార్జిన్‌తో దాటింది. పైగా టికెట్ రేట్స్ హైక్ అనేది ఈ సినిమాకు హెల్ప్ అయింది. మొత్తంగా ఈ వీకెండ్‌లో ఈ సినిమా రూ. 1000 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరడం ఖాయం అనే చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jr ntr, Rajamouli, Ram Charan, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు