RRR: ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఈ సారి మిస్ కాదంటున్న జక్కన్న..

ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ రాజమౌళి (Twitter/Photo)

RRR | ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా  ‘రౌద్రం రణం రుధిరం’ అదే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ  చేసాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై జక్కన్న కాన్ఫిడెండ్‌గా ఉన్నట్టు సమాచారం.

  • Share this:
    RRR | ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా  ‘రౌద్రం రణం రుధిరం’ అదే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ  చేసాడు. ఇక ఈ సినిమాను ముందుగా ఈ యేడాది జూలై 31న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత 2021 జనవరి 8కు పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత కరోనాతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఐతే.. ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేయాలనున్నారు.కానీ ఇపుడు మాత్రం ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో 2021 దసరాకు విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నాడు రాజమౌళి.

    ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నట్టు ఇప్పటికే రాజమౌళి తెలియజేసారు. ఇప్పటికే అల్లూరి సీతరామరాజుగా రామ్ చరణ్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రామరాజు పాత్రకు కొమరం భీమ్ వాయిస్ ఓవర్ అదిరిపోయింది. మరోవైపు  ఆర్ఆర్ఆర్ నుండి కొమరం భీమ్ టీజర్‌ను విడుదల చేసారు.

    Ram charan, ss rajamouli, rrr, jr ntr, ram charan Bollywood, రామ్ చరణ్, రాజమౌళి, ఆర్ఆర్ఆర్, జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్
    రామ్ చరణ్, ఎన్టీఆర్ Photo : Twitter


    రామరాజు వాయిస్ ఓవర్ మొదలైన ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి  రెస్పాన్స్ వచ్చింది. ది అలా ఉంటే కరోనా కారణంగా ఓ ఆరు నెలలు వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇంతలో రామ్ చరణ్‌కు కరోనా సోకింది. కానీ ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. ఇంకో 15 రోజుల షూటింగ్ మిగతా నటీనటులతో ఫిబ్రవరిలో షూట్ చేస్తే సరిపోతుంది. దీంతో ఆర్ఆర్ఆర్ దసరా రిలీజ్‌కు ఉన్న అడ్డంకులు తొలిగినట్టే. బాహుబలి తర్వతా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పనున్నారు. మిగతా భాషల్లో ఆయా భాషల్లో ఫేమసైన హీరోలతో చెప్పించే పనిలో ఉన్నాడు రాజమౌళి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: