RRR - Keeravani : ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కీరవాణికి షాకింగ్ రెమ్యునరేషన్.. ఎంతంటే..

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం షాకింగ్ రెమ్యునరేషన్ (Twitter/Photo)

RRR - Keeravani : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ  ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం కీరవాణి కళ్లు చెదిరే భారీ పారితోషకం తీసుకోనున్నట్టు సమాచారం.

  • Share this:
    RRR - Keeravani : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ  ఆర్ఆర్ఆర్. బాహుబలి సిరీస్‌ తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో ఈ సినిమా తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాపై తెలుగుతో పాటు మిగతా భాషల్లో క్రేజ్ నెలకొంది.  ఇక జక్కన్న సినిమా అంటే తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ, అన్నయ్య కీరవాణి మ్యూజిక్ ఉండాల్సిందే. అంతేకాదు రాజమౌళి తను తెరకెక్కించే ఏ  సినిమాలోనైనా సరే కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంటుంది. ఇక దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ నెలకొన్న ఈ సినిమా కోసం కీరవాణికి కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు సమాచారం. టాలీవుడ్ మోస్ట్ హాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లలో కీరవాణికి ఒకరు.  ఈయనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన చాలా మంది ఎపుడో ఫేడౌట్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లు కూడా స్లో అయ్యారు. కానీ కీరవాణి మాత్రం ఇప్పటికీ తన సంగీతంతో అదే టెంపో మెయింటెన్ చేస్తున్నారు.

    తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళంతో పాటు మిగతా 17 భాషల్లో తెరకెక్కోతున్న ఈ సినిమా కోసం కీరవాణి ఏకంగా రూ. 18 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకున్న దాఖలాలు లేవు. ఒక రకంగా మ్యూజిక్ డైరెక్టర్‌గా పారితోషకం విషయంలో కీరవాణి సెన్సేషన్ క్రియేట్ చేసారనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్ కూడా భారీ ధరకే అమ్ముడు పోయాయి. ప్రస్తుతం ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. నిన్న (మంగళవారం) చిత్ర యూనిట్ అక్కడ లాండ్ అయింది.

    ఆర్ఆర్ఆర్ ‘దోస్తి’ సాంగ్ గాయకులతో కీరవాణి, ఎన్టీఆర్, రామ్ చరణ్ (Twitter/Photo)


    ఇప్పటికే ప్రపంచ ఫ్రెండిషిప్ దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘దోస్త్’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ షెడ్యూల్‌తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తంగా పూర్తి కానుంది. దీంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయనున్నారు.ఐతే.. ఈ సినిమాను డీవివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు  నార్త్‌లో పెన్ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ సందర్భంగా పెన్ స్టూడియోస్‌ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ పార్టనర్స్‌ను అనౌన్స్ చేసారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డిజిటల్ రైట్స్‌ను జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు.

    RRR Movie Team Rajamouli Jr NTR Ram Charan Ajay Devgn Alia Bhatt Land In Ukraine For Last Schedule,RRR : ఆర్ఆర్ఆర్ లాస్ట్ షెడ్యూల్ కోసం ఉక్రెయిన్‌లో లాండ్ అయిన మూవీ టీమ్..,RRR,RRR Last Schedule,rrr Ukraine Last Schedule, Dosti Music Video Of RRR Hema Chandra MM Keeravaani NTR Ram Charan SS Rajamouli, కీరవాణీ, ఆర్ ఆర్ ఆర్ దోస్తీ సాంగ్,ఉక్రెయిన్‌లో లాండ్ అయిన ఆర్ఆర్ఆర్ టీమ్,ఉక్రెయిన్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్
    ఆర్ఆర్ఆర్ టీమ్ (Twitter/Photo)


    ఇక హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు ఇంగ్లీష్, టర్కిష్, పోర్చుగీసు, కొరియన్, స్పానిష్ భాషలకు సంబంధించిన డిజిటల్ ప్రసారాలను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది.ఈ సినిమా ఈ యేడాది అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: