RRR : ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ఆర్ఆర్ఆర్ మరో రికార్డు.. ఈ మూవీ ట్రైలర్ అన్ని భాషల్లో కలిసి 100 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసింది. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేసారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు జోడిగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటించారు.ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది చిత్రబృందం.
రీసెంట్‌గా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మలయాళం, తమిళంలోఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ తెలుగులో ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా థియేటర్స్‌లో విడుదలైన వెంటనే యూట్యూబ్‌లో రిలీజ్ చేసారు.
100 MILLION+ VIEWS across all languages for #RRRTrailer on @YouTubeIndia in 6 Days
FASTEST FOR ANY FILM IN INDIA
▶️https://t.co/URL8TbWLTk#RRRTrailerHits100MViews@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @RRRMovie @DVVMovies @jayantilalgada @PenMovies pic.twitter.com/ogP6cmnio5
— BA Raju's Team (@baraju_SuperHit) December 15, 2021
ఈ ట్రైలర్ ఇపుడు రికార్డుల వేట మొదలుపెట్టింది. RRR ట్రైలర్ విడుదలైన వెంటనే కేవలం 7 గంటల్లోనే టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ సాధించి ఆల్ టైమ్ నెంబర్ 1 ప్లేస్‌లో నిలిచింది. ఇపుడీ ట్రైలర్ 20 మిలియన్స్‌కు చేరువలో ఉంది. తాజాగా ఈ సినిమా తెలుగులో 40 మిలియన్ వ్యూస్‌కు దగ్గరగా ఉంది.
Balakrishna - Akhanda : ‘అఖండ’ సహా బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసారా తెలుసా..
ఇక హిందీ వెర్షన్ ట్రైలర్ కూడా తెలుగులో కంటే ఎక్కువ వ్యూస్ దక్కించుకుంది. ఈ సినిమా హిందీలో 49 మిలియన్ వ్యూస్ దాటి.. 50 మిలియన్ వ్యూస్ దాటింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ అంచనాలకు మించి ఉండటంతో సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
Celebrities Marriages 2021 : విక్కీ కౌశల్, కత్రినా సహా ఈ యేడాది పెళ్లి పీఠలు ఎక్కిన సినీ ప్రముఖులు..
ఇక తమిళంలో కేవలం 6.6 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇక మలయాలంలో కూడా దాదాపు 3.4 మిలియన్ వ్యూస్ కు దగ్గరలో ఉంది. కానీ కన్నడలో మాత్రం 7 మిలియన్ వ్యూస్‌కు పైగా దక్కించుకుంది. దాదాపు ఈ సినిమా ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.
Rashmika Mandanna : తలపై గాగుల్‌తో కెవ్వు కేక పుట్టిస్తోన్న రష్మిక మందన్న లేటెస్ట్ ఫోటో షూట్..
గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటన చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ (Ram Charan) నటించారు ‘భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’ అంటూ రామ్‌చరణ్ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్. ఇక పులి ఎదురుగా ఎన్టీఆర్ కూడా దాని మొహంలో మొహం పెట్టి గట్టిగా అరవడం మరో హైలైట్. రాజమౌళి ఈ సినిమా కోసం నాలుగేళ్లు ఎందుకు తీసుకున్నాడో ట్రైలర్ చూసిన తర్వాత అర్థమవుతుంది. ట్రైలర్‌లో చాలా వరకు ఎన్టీఆర్, చరణ్ కలిసున్న సన్నివేశాలే ఉన్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, హీరో అజయ్ దేవ్‌గన్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇందులో ఆమె చరణ్‌కు జోడీగా సీత పాత్రలో అలియా కనిపిస్తుంది. హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్.. తారక్‌కు జోడీగా నటించింది. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న నటులు చాలా మంది ఇందులో ఉన్నారు. తెలంగాణ యాసలో ఎన్టీఆర్ అదరగొట్టాడు.. అల్లూరిగా రామ్ చరణ్ కేక పెట్టించాడు. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు దానయ్య నిర్మాత. ఎంఎం కీరవాణి స్వరాలు అందిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా నిర్మితమైన RRR సినిమా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ajay Devgn, Alia Bhatt, Bollywood news, Jr ntr, Rajamouli, Ram Charan, Roudram Ranam Rudhiram, RRR, Tollywood