RRR : ఆర్ఆర్ఆర్ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసిన రాజమౌళి.. సినిమా రిలీజ్ ఎపుడో..

ఆర్ఆర్ఆర్ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసిన రాజమౌళి (Twitter/Photo)

RRR : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసిన రాజమౌళి.. ఇక సినిమా విడుదల తేది ఎపుడండే..

 • Share this:
  RRR :  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ  ఆర్ఆర్ఆర్ (RRR). బాహుబలి (Bahubali) సిరీస్‌ తర్వాత రాజమౌళి (Rajamouli), ఎన్టీఆర్ (Jr NTR),  రామ్ చరణ్ (Ram Charan) వంటి మాస్ హీరోలతో ఈ సినిమా తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాపై తెలుగుతో పాటు మిగతా భాషల్లో క్రేజ్ నెలకొంది. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు కీరవాణి (Keeravani) అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ‘దోస్త్’  పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్(Ajay Devgn) మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ (Alia Bhatt) కథానాయికగా నటిస్తోంది. ఎన్టీఆర్ సరసన ఓలివియా మోరీస్ యాక్ట్ చేస్తోంది.

  తాజాగా ఈ సినిమా మిగిలిన ఫార్ట్ కంప్లీట్ చేయడానికి చిత్ర యూనిట్ ఉక్రెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్టు ఆర్ఆర్ఆర్ యూనిట్ పేర్కొంది. ఓ రెండు షాట్స్ మినహా మొత్తం సినిమా పూర్తైనట్టు తెలియజేసారు. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ బాకీ ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసారు చిత్ర యూనిట్.


  అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా ’ఆర్ఆర్ఆర్’ (Roudram Ranam Rudhiram) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు ప్రాంతానికి చెందిన చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.  ఈ సినిమాను కూడా రాజమౌళి పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పూర్వ జన్మలో స్వాతంత్య్ర పోరాటం కోసం కన్నుమూసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు ఆ తర్వాత జన్మలో ఎలా తమ స్వాతంత్య్ర కాంక్ష నెరవేర్చుకున్నారనేదే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది.

  అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్.. మరోసారి హాట్ ఫోజులతో రెచ్చిపోయిన జబర్ధస్త్ బ్యూటీ..

  ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమాను వచ్చే యేడాది.. విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.  త్వరలో ఆర్ఆర్ఆర్ కొత్త విడుదల తేదిని ప్రకటించే అవకాశం ఉంది.  పైగా అన్ని భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పర్యవేక్షించాలి. ఈ సినిమా హిందీ, తమిళంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వాళ్ల పాత్రలకు వాళ్లే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.

  Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..


  మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కనివిని ఎరుగని రీతిలో జరుగుతోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైపోయింది. ఈ సినిమాకు సంబంధించిన నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన  శాటిలైట్ మరియు  డిజిటల్ హక్కులను హోల్‌సేల్‌గా సొంతం చేసుకుంది. వీళ్లే అన్ని భాషల్లో ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్‌కు సంబంధించి బిజినెస్ డీల్ పూర్తి చేసారు.

  ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ (File/Photo)


  ఐతే.. ఈ సినిమాను డీవివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు  నార్త్‌లో పెన్ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. భారత దేశంలో ఏ సినిమాకు జరగని బిజినెస్ ఆర్ ఆర్ ఆర్‌కు జరిగిందని అంటున్నారు. . ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, టర్కీష్, ఇంగ్లీష్, జపనీస్,చైనీస్, పోర్చుగీసు, కొరియన్, స్పానిష్ స్పానిష్,  భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా పెన్ స్టూడియోస్‌ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ పార్టనర్స్‌ను అనౌన్స్ చేసారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డిజిటల్ రైట్స్‌ను జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు. ఇక హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు ఇంగ్లీష్, టర్కిష్, పోర్చుగీసు, కొరియన్, స్పానిష్ భాషలకు సంబంధించిన డిజిటల్ ప్రసారాలను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ విడుదల తేది మార్పుపై త్వరలో అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉందంటున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: