RRR: ఆర్ఆర్ఆర్ సినిమా కొత్త విడుదల తేది.. ఈ యేడాది కూడా అభిమానులకు నిరాశే..

RRRలో ఎన్టీఆర్, రామ్ చరణ్ (Twitter/Photo)

RRR: ఆర్ఆర్ఆర్ సినిమా కొత్త విడుదల తేది.. ఈ యేడాది కూడా అభిమానులకు నిరాశే అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.

  • Share this:
    RRR: ఆర్ఆర్ఆర్ సినిమా కొత్త విడుదల తేది.. ఈ యేడాది కూడా అభిమానులకు నిరాశే అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. కరోనా మొదటి వేవ్‌తో ఇప్పటికే రెండు సార్లు విడుదల తేది వాయిదా పడ్డ ఆర్ఆర్ఆర్ మూవీ ఇపుడు మరోసారి వాయిదా పడ్డట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ప్రెజెంట్ దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం).  ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు ప్రాంతానికి చెందిన చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.  ఈ సినిమాను కూడా రాజమౌళి పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పూర్వ జన్మలో స్వాతంత్య్ర పోరాటం కోసం కన్నుమూసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు ఆ తర్వాత జన్మలో ఎలా తమ స్వాతంత్య్ర కాంక్ష నెరవేర్చుకున్నారనేదే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది.

    ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌కు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, రామ్ చరణ్ సరసన హీందీ నటి అలియా భట్, అజయ్ దేవ్‌గణ్ సరసన శ్రియ నటిస్తోంది.  కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ దాదాపు ఓ ఎనిమిది నెలలు వాయిదా పడింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మరోసారి కరోనా కారణంగా  వాయిదా పడింది.ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమాను వచ్చే యేడాది.. జనవరి 26న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ తేది అన్ని విధాలుగా తగినదిగా రాజమౌళి భావిస్తున్నట్టు సమాచారం. త్వరలో ఆర్ఆర్ఆర్ కొత్త విడుదల తేదిని ప్రకటించే అవకాశం ఉంది.

    ZEE5, Zee network acquired the digital and satellite rights of RRR Movie in all languages,pen movies acquired the North India Distribution Rights, Ram Charan Birth day gift, Nick Powell Ram charan ntr RRR new Release Date confirmed officially announced, RRR Release Date leaked, English actor alison doody leaks the rrr release date, RRR update, ntr news, ntr intro,RRR update,Ntr as Komaram Bheem look,RRR fight secens,RRR news,RRR ntr fight,RRR leaks,ఆర్ ఆర్ ఆర్ లీక్స్, రాజమైమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, charan intro,charan rrr intro, ntr rrr intro rrr release date
    ఆర్ఆర్ఆర్ మూవీ పోస్టర్


    మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కనివిని ఎరుగని రీతిలో జరుగుతోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైపోయింది. ఈ సినిమాకు సంబంధించిన నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన  శాటిలైట్ మరియు  డిజిటల్ హక్కులను హోల్‌సేల్‌గా సొంతం చేసుకుంది. వీళ్లే అన్ని భాషల్లో ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్‌కు సంబంధించి బిజినెస్ డీల్ పూర్తి చేసారు.

    ఐతే.. ఈ సినిమాను డీవివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు  నార్త్‌లో పెన్ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ సందర్భంగా పెన్ స్టూడియోస్‌ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ పార్టనర్స్‌ను అనౌన్స్ చేసారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డిజిటల్ రైట్స్‌ను జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు. ఇక హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు ఇంగ్లీష్, టర్కిష్, పోర్చుగీసు, కొరియన్, స్పానిష్ భాషలకు సంబంధించిన డిజిటల్ ప్రసారాలను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది.

    Happy Birth Day Ajay Devgan Ajay Devgn Motion Poster RRR Movie NTR Ram Charan, Alia Bhatt SS Rajamouli,pen movies acquired the North India Distribution Rights, Ram Charan Birth day gift, Nick Powell Ram charan ntr RRR new Release Date confirmed officially announced, RRR Release Date leaked, English actor alison doody leaks the rrr release date, RRR update, ntr news, ntr intro,RRR update,Ntr as Komaram Bheem look,RRR fight secens,RRR news,RRR ntr fight,RRR leaks,ఆర్ ఆర్ ఆర్ లీక్స్, రాజమైమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, charan intro,charan rrr intro, ntr rrr intro rrr release date
    ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవ్‌గణ్ (Twitter/Photo)


    ఇక శాటిలైట్ పార్టనర్స్ విషయానికొస్తే.. ఈ సినిమాను తెలుగు ,లో స్టార్ మాలో కన్నడ, తమిళ్‌లో స్టార్ నెట్‌వర్స్ ప్రసార హక్కులను దక్కించుకున్నట్టు ప్రకటించారు.   ఇక హిందీ వెర్షన్ మాత్రం జీ టీవీలో ప్రసారం కానుంది. మలయాళ వెర్షన్ ఏషియన్ నెట్‌లో టెలికాస్ట్ కానుంది. హిందీ థియేట్రికల్ హక్కులను పెన్ స్టూడియోస్ జయంతి లాల్ గడ దక్కించుకున్నారు.

    ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరిగా రామ్ చరణ్


    ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ‘ఆర్ఆర్ఆర్’ హిందీ తప్ప మిగతా భాషల డిజిటల్ హక్కులను అమ్మారు.  నెట్‌ఫ్లిక్స్  దాదాపు రూ. 200 కోట్ల హిందీ, ఇంగ్లీష్, టర్కిష్, స్పానిష్, కొరియన్ భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ అమ్ముడు పోయినట్టు సమాచారం.   ఇంత భారీ ధరకు  ఓ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ పలకడం ఇదే మొదటిసారి అంటున్నారు. దీంతో సినిమా ప్రీరిలీజ్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, హిందీ వెర్షన్, ఓవర్సీస్ హక్కులు, శాటిలైట్, డిజిటల్ రైట్స్ బిజినెస్ మొత్తం సుమారు రూ.1200 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్టు సమాచారం.

    ‘ఆర్ఆర్ఆర్’లో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ లుక్ (Twitter/Photo)


    దీంతో ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమాకు జరగని బిజినెస్ ఆర్ ఆర్ ఆర్‌కు జరిగిందని అంటున్నారు. . ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, టర్కీష్, ఇంగ్లీష్, జపనీస్,చైనీస్, పోర్చుగీసు, కొరియన్, స్పానిష్ స్పానిష్,  భాషల్లో విడుదల కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: