Home /News /movies /

RRR : ఆర్ఆర్ఆర్ సంచలన నిర్ణయం.. అది వాయిదా వేసిన చిత్ర యూనిట్..

RRR : ఆర్ఆర్ఆర్ సంచలన నిర్ణయం.. అది వాయిదా వేసిన చిత్ర యూనిట్..

RRR అది వాయిదా (Twitter/Photo)

RRR అది వాయిదా (Twitter/Photo)

RRR | ఆర్ఆర్ఆర్ సంచలన నిర్ణయం.. అది వాయిదా వేసిన చిత్ర యూనిట్.. దీంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. 

  RRR | ఆర్ఆర్ఆర్ సంచలన నిర్ణయం.. అది వాయిదా వేసిన చిత్ర యూనిట్.. దీంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ మరో హీరోగా నటించారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు జోడిగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది చిత్రబృందం.

  ఇక విడుదల తేది దగ్గరపడుతుండడంతో ఓ రేంజ్‌లో ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. రీసెంట్‌గా  ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ట్రైలర్‌ను డిసెంబర్ 3న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ట్రైలర్ విడుదలను వాయిదా వేస్తున్నట్టు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.  RRR  సినిమాపై తెలుగు ఇండస్ట్రీలోనే కాదు హోల్ భారతీయ చిత్ర పరిశ్రమ వెయిట్ చేస్తోంది.ఇప్పటికే దోస్తీ అంటూ ఓ సాంగ్‌ను విడుదల చేసిన చిత్రబృందం ఇటీవల నాటు నాటు అనే సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. రాహుల్ సిప్లీగంజ్, కాల భైరవ పాడారు.  తాజాగా ఈ సినిమా నుంచి  మూడో సాంగ్ జనని కూడా విడుదలైంది. ఈ వీడియో సాంగ్ వివిధ భాషల్లో విడుదలచేసింది చిత్రబృందం. ఈ పాట సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

  Sirivennala Seetharama Sastry : సిరివెన్నెల సీతారామశాస్త్రి చనిపోవడానికి అసలు కారణం అదేనా..

  ఆర్ఆర్ఆర్ మూవీ సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ టైమ్‌కు తెలిసింది. ఆర్ ఆర్ ఆర్ మూడు గంటల ఆరు నిమిషాలు ఉందని చెబుతున్నారు.

  Sirivennela - SP Balu : 2020లో ఎస్పీ బాలు.. 2021లో సీతారామశాస్త్రి.. కుప్పకూలిన తెలుగు చిత్ర పరిశ్రమ సాహితీ సౌరభాలు..


  ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. దివంగత సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.

  ఇద్దరం కలిసి అది తాగుదాం.. సీతారామశాస్త్రికి రామ్ గోపాల్ వర్మ విభిన్న నివాళి..

  ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆలియా భట్ .. సీత పాత్రలో నటించింది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ajay Devgn, Bollywood news, Jr ntr, Rajamouli, Ram Charan, Roudram Ranam Rudhiram, RRR, Tollywood

  తదుపరి వార్తలు