Home /News /movies /

RRR : యూట్యూబ్‌లో ఆర్ఆర్ఆర్ జననీ సాంగ్ దూకుడు.. 10 మిలియన్ వ్యూస్‌తో రచ్చ..

RRR : యూట్యూబ్‌లో ఆర్ఆర్ఆర్ జననీ సాంగ్ దూకుడు.. 10 మిలియన్ వ్యూస్‌తో రచ్చ..

ఆర్ఆర్ఆర్ జనని సాంగ్ 10 మిలియన్ వ్యూస్ (Twitter/Photo)

ఆర్ఆర్ఆర్ జనని సాంగ్ 10 మిలియన్ వ్యూస్ (Twitter/Photo)

RRR - Janani Song | ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా నిన్న విడుదలైన ‘జననీ’ సాంగ్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఇంకా చదవండి ...
    RRR - Janani Song | ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది చిత్రబృందం. ఇక విడుదల తేది దగ్గరపడుతుండడంతో ఓ రేంజ్‌లో ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది.

    అందులో భాగంగా ఇప్పటికే దోస్తీ అంటూ ఓ సాంగ్‌ను విడుదల చేసిన చిత్రబృందం ఇటీవల నాటు నాటు అనే సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. రాహుల్ సిప్లీగంజ్, కాల భైరవ పాడారు.  తాజాగా ఈ సినిమా నుంచి  మూడో సాంగ్ జనని కూడా విడుదలైంది. ఈ వీడియో సాంగ్ వివిధ భాషల్లో విడుదలచేసింది చిత్రబృందం. ఈ పాట సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ పాట విడుదలై 24 గంటలు గడవక ముందే.. వివిధ భాషల్లో 10 మిలియన్ వ్యూస్‌ పైగా సంపాదించింది.


    రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియ శరణ్‌లు ఈ వీడియో సాంగ్‌లో కనిపించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూనే, ఈ పాటకి లిరిక్స్ అందించారు. ఏమోషన్ లిరిక్స్‌తో ఆకట్టుకుంటోంది జనని. ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతూ అదరగొడుతోంది.

    Tollywood Family Multistarers : తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ మొదలైన ఫ్యామిలీ మల్టీస్టారర్స్ సందడి..

    అంతేకాదు.. ఆర్ఆర్ఆర్ మూవీ సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ టైమ్‌కు తెలిసింది. ఆర్ ఆర్ ఆర్ మూడు గంటల ఆరు నిమిషాలు ఉందని చెబుతున్నారు.

    Nagarjuna - K Raghavendra Rao : నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

    ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.

    Samantha International Movie : సమంత కంటే ముందు ఇంటర్నేషనల్ మూవీస్‌లో నటించిన మన దేశపు స్టార్స్ వీళ్లే..


    ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ajay Devgn, Alia Bhatt, Bollywood news, Jr ntr, Ram Charan, RRR, Tollywood

    తదుపరి వార్తలు