RRR RAJAMOULI CALRITY ABOUT NTR RAM CHARAN ROUDRAM RANAM RUDHIRAM RELEASE DATE TA
RRR: ఆర్ఆర్ఆర్ విడుదల విషయమై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి..
రాజమౌళి Photo : Twitter
RRR Rajamouli | రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమ ా చేస్తున్నాడు. ఈ సినిమాకు తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ ఖరారు చేసారు. తాజాగా ఈ సినిమా విడుదల విషయమై రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.
RRR Rajamouli | రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమ ా చేస్తున్నాడు. ఈ సినిమాకు తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ ఖరారు చేసారు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా అన్నీ ఆగిపోయినట్టే టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా ఆగిపోయింది. మధ్యలో కొంత మంది డూప్లతో ఈ సినిమా షూటింగ్ చేయాలనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కానీ షూటింగ్స్ రాలేమని చెప్పడంతో ఆర్ఆర్ఆర్ స్క్రిప్ట్ విషయంలో రాజమౌళి మరిన్ని మెరుగులు దిద్దాడు. ఈ లోగా రాజమౌళితో పాటు నిర్మాత దానయ్యకు కరోనా సోకింది. ప్రస్తుతం వీళ్లిద్దరు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం అందరు హీరోలు షూటింగ్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అంటూ రాజమౌళికి చెప్పాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మళ్లీ పట్టాలెక్కనుంది.
RRR సినిమాలో చరణ్,అజయ్,ఎన్టీఆర్,జక్కన్న ఫోటో (RRR movie shooting pic)
ఇప్పటికే లాక్డౌన్ కారణంగా కీలకమైన ఆరు నెలలు వృథా అయ్యాయి. ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాలో నటించే నటీనటుల డేట్స్ మళ్లీ అడ్జస్ట్ చేయాల్సిన పని పడింది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తైయిన ఈ సినిమాలో మిగతా యాక్షన్ పార్ట్‌ను కొద్ది మందితో రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో పూర్తి చేయనున్నారు. ఇప్పడున్న పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించడం అంత తేలిక కాదు అన్నారు. కరోనా ముందైతే.. నేను రిలీజ్ డేట్ చెప్పాను. ఇపుడు చెప్పడం కష్టం అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.
ప్రస్తుతం రెండు నెలలు కంటిన్యూగా షూటింగ్ ప్లాన్ చేసాం. ఆ రెండు నెలలు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే.. రిలీజ్ డేట్ పై ఓ అవగాహన వస్తోంది. మరోవైపు ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్‌ను దసరా లేదా దీపావళికి రిలీజ్ చేయనున్నట్టు చెప్పుకొచ్చాడు రాజమౌళి. మొత్తంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే యేడాది సమ్మర్ తర్వాత కానీ విడుదలయ్యే అవకాశాలు కనబడటం లేదు.