RRR : ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌కు రాజమౌళి మరో బిగ్ షాక్ ఇవ్వనున్నారా.. ? ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పై మళ్లీ కన్ఫ్యూజన్..

ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి (File/Photo)

RRR : ఎన్టీఆర్, రాజమౌళి అభిమానులకు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో  రాజమౌళి మరో బిగ్ షాక్ ఇవ్వనున్నారా..  అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. 

 • Share this:
  RRR : ఎన్టీఆర్, రాజమౌళి అభిమానులకు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో  రాజమౌళి మరో బిగ్ షాక్ ఇవ్వనున్నారా..  అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. వివరాల్లోకి వెళితే..ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలు, ప్యాచ్ వర్క్ షూటింగ్ చేస్తున్నారు. ఈ నెలాఖరుకు ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీకి రాజమౌళి గుమ్మడికాయ కొట్టేయనున్నారు. ఒకవైపు ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్‌తో పాటు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసారు చిత్ర యూనిట్.  అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా ’ఆర్ఆర్ఆర్’ (Roudram Ranam Rudhiram) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు ప్రాంతానికి చెందిన చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.  ఈ సినిమాను కూడా రాజమౌళి పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

  పూర్వ జన్మలో స్వాతంత్య్ర పోరాటం కోసం కన్నుమూసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు ఆ తర్వాత జన్మలో ఎలా తమ స్వాతంత్య్ర కాంక్ష నెరవేర్చుకున్నారనేదే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘దోస్తీ’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  NTR Ram Charan enjoys Kyiv city, Dosti Music Video Of RRR Hema Chandra MM Keeravaani NTR Ram Charan SS Rajamouli, కీరవాణీ, ఆర్ ఆర్ ఆర్ దోస్తీ సాంగ్NTR Ram Charan enjoys Kyiv city, Dosti Music Video Of RRR Hema Chandra MM Keeravaani NTR Ram Charan SS Rajamouli, కీరవాణీ, ఆర్ ఆర్ ఆర్ దోస్తీ సాంగ్
  ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ (NTR and Ram Charan Photo : Twitter)


  ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమాను వచ్చే యేడాది.. జనవరి 26న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ తేది అన్ని విధాలుగా తగినదిగా రాజమౌళి భావిస్తున్నట్టు సమాచారం. త్వరలో ఆర్ఆర్ఆర్ కొత్త విడుదల తేదిని ప్రకటించే అవకాశం ఉంది.  పైగా అన్ని భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పర్యవేక్షించాలి. ఈ సినిమా హిందీ, తమిళంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వాళ్ల పాత్రలకు వాళ్లే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.

  RRR Ram Charan Angry With NTR Words On RRR Set Video Goes Viral,RRR,Ram Charan Angry on Jr NTR,RRR Movie Unit Issues Special ID Cards,RRR Last Schedule,rrr Ukraine Last Schedule, Dosti Music Video Of RRR Hema Chandra MM Keeravaani NTR Ram Charan SS Rajamouli, కీరవాణీ, ఆర్ ఆర్ ఆర్ దోస్తీ సాంగ్,ఉక్రెయిన్‌లో లాండ్ అయిన ఆర్ఆర్ఆర్ టీమ్,ఉక్రెయిన్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్,ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్‌కు ఐడీ కార్డులు,ఆర్ఆర్ఆర్ యూనిట్ పై రామ్ చరణ్ అసహనం
  ఎన్టీఆర్ , రామ్ చరణ్ (Twitter/Photo)


  మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కనివిని ఎరుగని రీతిలో జరుగుతోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైపోయింది. ఈ సినిమాకు సంబంధించిన నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన  శాటిలైట్ మరియు  డిజిటల్ హక్కులను హోల్‌సేల్‌గా సొంతం చేసుకుంది. వీళ్లే అన్ని భాషల్లో ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్‌కు సంబంధించి బిజినెస్ డీల్ పూర్తి చేసారు.

  ఆర్ఆర్ఆర్‌ హీరోలతో రాజమౌళి (Twitter/Photo)


  ఐతే.. ఈ సినిమాను డీవివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు  నార్త్‌లో పెన్ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. భారత దేశంలో ఏ సినిమాకు జరగని బిజినెస్ ఆర్ ఆర్ ఆర్‌కు జరిగిందని అంటున్నారు. . ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, టర్కీష్, ఇంగ్లీష్, జపనీస్,చైనీస్, పోర్చుగీసు, కొరియన్, స్పానిష్ స్పానిష్,  భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా పెన్ స్టూడియోస్‌ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ పార్టనర్స్‌ను అనౌన్స్ చేసారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డిజిటల్ రైట్స్‌ను జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు. ఇక హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు ఇంగ్లీష్, టర్కిష్, పోర్చుగీసు, కొరియన్, స్పానిష్ భాషలకు సంబంధించిన డిజిటల్ ప్రసారాలను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ విడుదల తేది మార్పుపై త్వరలో అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉందంటున్నారు.

  ఇవి కూడా చదవండి

  Pawan Kalyan - Rana : పవన్ కళ్యాణ్, రానా మూవీకి అదిరిపోయే టైటిల్.. ఖుషీ చేసుకుంటున్న ఫ్యాన్స్..


  Ram Charan: జాతీయ పతాకాన్ని అవమానపరిచాడంటూ రామ్ చరణ్ పై మండిపడుతున్న నెటిజన్స్..

  Independence Day 2021: టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై సైనికుడి పాత్రలో మెప్పించిన హీరోలు..


  Venkatesh@35Years : టాలీవుడ్‌లో హీరోగా 35 యేళ్లు పూర్తి చేసుకున్న వెంకటేష్.. విక్టరీ హీరో కెరీర్‌‌‌లో టాప్ సినిమాలు ఇవే..


  HBD Sridevi : అప్పటి తరంలో శ్రీదేవి.. ఈ తరంలో కాజల్, తమన్నా..


  Pooja Hegde: కాటుక కళ్లతో మాయ చేస్తోన్న బుట్టబొమ్మ .. పూజా హెగ్డే గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా..

  Published by:Kiran Kumar Thanjavur
  First published: