RRR : ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా మిగిలిన దేశం మొత్తం ఆర్ఆర్ఆర్ ఫీవర్‌తో ఊగిపోతోంది. రిలీజ్‌కు ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండటం పైగా ప్యాన్ ఇండియా మూవీ కావడంతో రాజమౌళి.. ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌లను వెంటేసుకొని దేశం మొత్తాన్ని చుట్టేస్తున్నారు. ఇప్పటికే దుబాయ్, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీలో ఈ సినిమాను సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. కాసేటి క్రితమే చిత్ర బృందం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం అక్కడికి వెళ్లారు. అంతేకాదు అక్కడ సిక్కుల పవిత్ర స్థలమైన స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. మరోవైపు సాయంత్రం రాజమౌళి తన బృందంతో కలిసి రాజస్థాన్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఈ సినిమాను మేకర్స్.. ఐమాక్స్, 3D, డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ చేస్తున్నారు.
ఇక డాల్బీ విడుదల కాబోతున్న మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాకు నాలుగు రోజుల మాత్రమే మిగిలింది ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయింది. తెలంగాణ (నైజాం), ఏపీ, సీడెడ్‌లో ఈ సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. ఏయే ఏరియాల్లో ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంటే..
KGF Chapter 2 : కేజీఎఫ్ చాప్టర్ 2 నుంచి తుఫాన్ సాంగ్ విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..
నైజాం (తెలంగాణ): రూ. 75 కోట్లు
సీడెడ్ (రాయలసీమ): రూ. 45 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 23 కోట్లు
ఈస్ట్: రూ. 15 కోట్లు
వెస్ట్: రూ. 13కోట్లు
గుంటూరు: రూ. 17 కోట్లు
కృష్ణా: రూ. 14 కోట్లు
నెల్లూరు: రూ. 9 కోట్లు
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 211 కోట్లు
మొత్తంగా తెలంగాణలో రూ. 75 కోట్లు.. మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ రూ. 136 కోట్ల రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ బిజినెస్ చేసిన సినిమాలు ఏవి లేవు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 రూ. 122 కోట్లు బిజినెస్ చేసింది. సాహో రూ. 121.6 కోట్లు.. , సైరా నరసింహారెడ్డి 106.8 కోట్లు.. ఇక రాధే శ్యామ్ 105.20 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ఈ సినిమాను యూకేలోని ఓడియన్ బీఎఫ్ఐ ఐమ్యాక్స్ థియోటర్స్ ప్రీమియర్ షోగా ప్రదర్శించనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించనున్నట్టు తెలుస్తుంది. ఇక యూకేలోని వెయ్యి స్క్రీన్స్‌లో (RRR) ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేస్తున్నారట.
Balakrishna - Mahesh Babu : బాలకృష్ణను ఆ విధంగా ఫుల్లుగా వాడుకున్న మహేష్ బాబు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.