Home /News /movies /

RRR RAJAMOULI AJAY DEVGN JR NTR RAM CHARAN ALIA BHATTS RRR MOVIE 6 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS TA

RRR 6 Days World Wide Collections : ఆర్ఆర్ఆర్ 6 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. మొత్తంగా ఎంత రాబట్టిందంటే.

RRR 6 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ (Twitter/Photo)

RRR 6 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ (Twitter/Photo)

RRR 6 Days World Wide Collections : : ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీ విజయం విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా ఆరో రోజు నైజాంలో బ్రేక్ ఈవెన్ అయింది. అటు ఓవర్సీస్, సీడెడ్‌లో బ్రేక్‌ ఈవెన్‌కు దగ్గరగా ఉంది. మొత్తంగా ఈ సినిమా ఆరు రోజుల్లో బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికొస్తే..

ఇంకా చదవండి ...
    RRR 5 Days World Wide Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి  (Rajamouli) డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan)  వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీగా మొదటి రోజు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు.  బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. ఇక ఈ సినిమాను మేకర్స్.. ఐమాక్స్, 3D, డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ చేసారు. ఇక డాల్బీ విడుదలైన మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది.

    ఆలియా భట్, ఒలివియా మోరీస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా గత శుక్రవారం (25/3/2022)న విడుదలై మంచి టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతోంది. మొత్తంగా ఆరు రోజుల్లో ఈ సినిమా నైజాంలో బ్రేక్ ఈవెన్ అయింది. ఓవర్సీస్‌, సీడెడ్ (రాయలసీమ)లో బ్రేక్‌ ఈవెన్‌కు దగ్గరగా ఉంది.  ఆరో రోజు ఈ సినిమా తెలంగాణ+ ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 4.80 + రూ. 4.74 కోట్లు కలిపి మొత్తంగా రూ. 9.54  కోట్లు వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్, తమిళనాడు, కర్ణాటక మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 13.35.కోట్లు రాబట్టింది. ఈ రెండు కలిపితే ప్రపంచ వ్యాప్తంగా ఆరో రోజు ఈ సినిమా రూ. 23.19 కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఆరు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

    RRR: నైజాం(తెలంగాణ)లో RRR సరికొత్త రికార్డు.. కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన రాజమౌళి..

    నైజాం (తెలంగాణ):  రూ. 73.15 కోట్లు  /రూ . 70 కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 36.03 కోట్లు  / రూ. 37 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ. 20.27 కోట్లు / రూ. 22 కోట్లు
    ఈస్ట్: రూ. 10.05 కోట్లు  / రూ. 14 కోట్లు
    వెస్ట్: రూ. 9.50 కోట్లు /రూ. 12 కోట్లు
    గుంటూరు: రూ. 13.73 కోట్లు / రూ. 15 కోట్లు
    కృష్ణా:రూ. 10.45 కోట్లు  / రూ. 13 కోట్లు
    నెల్లూరు: రూ. 6.19 కోట్లు / రూ. 8 కోట్లు

    తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 180.17 కోట్లు (రూ. 267.70 కోట్లు గ్రాస్)/ (టోటల్ తెలంగాణ+ఏపీ  బిజినెస్ రూ. 191 కోట్లు) ముందుగా రూ. 211 కోట్లకు అమ్మారు. కొన్ని ఏరియాల్లో తగ్గించిన తర్వాత రూ. 191కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

    కర్ణాటక: రూ. 26.15 కోట్లు(  / రూ. 41 కోట్లు
    తమిళనాడు: రూ. 23.55 కోట్లు  /రూ. 35 కోట్లు
    కేరళ:  5.35 కోట్లు  / రూ. 9 కోట్లు
    హిందీ: 60.10 కోట్లు  / రూ. 92 కోట్లు

    రెస్టాఫ్ భారత్ : రూ.4.85 కోట్లు / రూ. 8 కోట్లు
    ఓవర్సీస్: రూ. 71.20 కోట్లు  / రూ. 75 కోట్లు)
    వరల్డ్ వైడ్  కలెక్షన్స్ :రూ. 371.37 కోట్లు షేర్ (రూ.670కోట్ల గ్రాస్) / (ఆర్ఆర్ఆర్ టోటల్ వాల్డ్ వైడ్ బిజినెస్ రూ.. 451 కోట్లు)

    KGF 2 Vs RRR : విడుదలకు ముందే ఆర్ఆర్ఆర్ పేరిట ఆ రికార్డును బ్రేక్ చేసిన కేజీఎఫ్ 2..

    ఆర్ఆర్ఆర్ మొదటి రోజు.. రూ. 135 కోట్లు ( 235 కోట్లు గ్రాస్ )
    రెండో రోజు : రూ. 67.44 కోట్లు  (121 కోట్లు గ్రాస్ )
    మూడో రోజు : రూ. 78.73 కోట్లు (రూ. 140 కోట్లు గ్రాస్ )
    నాలుగో రోజు : రూ. 35.88 కోట్లు  (రూ. 69 కోట్లు గ్రాస్)
    ఐదో రోజు : రూ. 31.13 కోట్లు (రూ. 60 కోట్లు గ్రాస్)
    ఆరో రోజు : రూ. 23.19 కోట్లు (రూ. 45 కోట్ల గ్రాస్ )

    ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆరో రోజు వరకు  రూ. 371.37 కోట్ల షేర్ రాబట్టి మంచి హోల్డ్ క్రియేట్ చేసింది.  హిందీలో మొదటి రోజు తక్కువే వచ్చినా రెండో  రోజు నుంచి పుంజుకుంది.  ఓవరాల్‌గా మాత్రం బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడించింది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే.. రూ. 453 కోట్ల షేర్ రాబట్టాలి. మొత్తంగా ఐదు రోజులు కలిపి  రూ. 371.37 కోట్ల షేర్‌ సాధించింది.  ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే..ఇంకా  రూ. 81.63 కోట్లు షేర్ రాబట్టాలి. హిందీలో కూడా రికార్డు స్థాయి వసూళ్లను ఈ సినిమా రాబడుతోంది.  మొత్తంగా ఈవీకెండ్ వరకు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jr ntr, Rajamouli, Ram Charan, RRR, Tollywood, Tollywood Box Office Report

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు