PM Modi - RRR: ఆర్ఆర్ఆర్ మూవీ గతేడాది విడుదలైన ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్టైయింది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. గోల్డెన్ గ్లోబ్ వచ్చిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆర్ఆరఆర్ టీమ్‌కు బెస్ట్ విషెస్ అంజేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఆర్ఆర్ఆర్ మూవీకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై ప్రత్యేకంగా ఆర్ఆఆర్ఆర్ టీమ్‌ను పేరు పేరునా పలకరించారు. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ఈ మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ అవార్డును గెలుచుకుంది. ఈ పాటలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఈ అవార్డు కార్యక్రమానికి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి సహా ఆర్ఆర్ఆర్ టీమ్‌లో కీలక సభ్యులు హాజరయ్యారు. ఇక నాటు నాటు ఒరిజినల్ విభాగంలో కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు రావడంపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆర్ఆర్ఆర్ టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలియజేసారు. అటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రశంసలు అందుకున్నారు.
A very special accomplishment! Compliments to @mmkeeravaani, Prem Rakshith, Kaala Bhairava, Chandrabose, @Rahulsipligunj. I also congratulate @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. This prestigious honour has made every Indian very proud. https://t.co/zYRLCCeGdE
— Narendra Modi (@narendramodi) January 11, 2023
What a Phenomenal, Historic Achievement !!!! ???????????????? Golden Globes Best Original Song - Motion Picture Award to @mmkeeravaani garu !! Take a Bow!???? Heartiest Congratulations Team @RRRMovie & @ssrajamouli !! India is proud of you! ???????? #NaatuNaatu ???????? pic.twitter.com/gl7QjMkJtZ
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 11, 2023
Delighted to learn that @RRRMovie has won the #GoldenGlobes Award for Best Original Song! Congratulations to @mmkeeravaani, @ssrajamouli and the entire team! Absolutely proud! Like I said earlier, Telugu has now become the language of Indian soft power.#NaatuNaatu #RRRMovie pic.twitter.com/ZpIQ7TbI5K
— N Chandrababu Naidu (@ncbn) January 11, 2023
ఆర్.ఆర్.ఆర్. చిత్ర గీతానికి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం సంతోషదాయకం - పవన్ కళ్యాణ్ #PawanKalyan #RRRMovie #NatuNatu #GoldenGlobes2023 pic.twitter.com/YGxDxNUIGG
— BA Raju's Team (@baraju_SuperHit) January 11, 2023
ఇక మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్ఆర్ఆర్ టీమ్‌ను ప్రశంసించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సందర్భంగా కీరవాణి రీ ట్వీట్ చేస్తూ.. ఈ అవార్డు స్వీకరించడంతో పాటు మీ ఆశీర్వాదాలు ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతుడిని అంటూ చెప్పుకొచ్చారు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డులు-2023 కార్యక్రమం ప్రస్తుతం కాలిఫోర్నియాలో జరుగుతోంది. ఈ సందర్భంగా RRR మూవీ రెండు నామినేషన్‌లతో ఈ అవార్డుల్లో చోటు సంపాదించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ మూవీ కేటగిరీల్లో ఈ మూవీ నామినేట్ కాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డును కీరవాణి అందుకున్నాడు. ఓ ఇండియన్ సినిమాకు ఈ విభాగంలో అవార్డు దక్కడం ఇదే తొలిసారి. అవార్డు ప్రకటించగానే.. ఒక్కసారిగా అక్కడ ఉన్నఆర్ఆర్ఆర్ టీం అంతా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకుంది. ఎన్టీఆర్, రాజమౌళి,రామ్ చరణ్, కీరవాణి,తమ భార్యలతో కలిసి ఈ వేడుకకు వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఆ ఫంక్షన్‌లో ఆర్ఆర్ఆర్ టీం చేసిన సందడికి అంతా చప్పట్లు కొట్టారు. అవార్డు ప్రకటించగానే.. కీరవాణి వెళ్లి ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Golden Globe Award, Jr ntr, M. M. Keeravani, PM Narendra Modi, Rajamouli, Ram Charan, RRR, Tollywood