#RRRPressMeet.. అల్లూరి, కొమరం భీం స్పూర్తిగా రాజమౌళి సినిమా..

RRR | రాజమౌళి RRR సినిమా గురించి..చిత్ర విశేషాల గురించి.. ఏ మాత్రం బయటకు లీక్ చేయడం లేదు.  ఇప్పటికే ఈ సినిమా స్టోరీపై రకరకాల ఊహాగానలు మొదలైనాయి. ఈ విషయమై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

news18-telugu
Updated: March 14, 2019, 12:41 PM IST
#RRRPressMeet.. అల్లూరి, కొమరం భీం స్పూర్తిగా రాజమౌళి సినిమా..
రాజమౌళితో తారక్, రామ్ చరణ్
  • Share this:
రాజమౌళి RRR సినిమా గురించి..చిత్ర విశేషాల గురించి.. ఏ మాత్రం బయటకు లీక్ చేయడం లేదు.  ఇప్పటికే ఈ సినిమా స్టోరీపై రకరకాల ఊహాగానలు మొదలైనాయి. ఈసినిమా స్వాతంత్య్రపు పూర్వపు కాలపు కథతో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోందని ఫిల్మ్‌నగర్‌లో ఊహాగానాలు మొదలైనాయి. అంతేకాదు  RRRలో ఎన్టీఆర్‌ పాత్ర రాబిన్‌హుడ్‌ తరహా బందిపోటు పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమా కోసం ఎన్టీఆర్ తన బాడీని కూడా పెంచాడు. మరోవైపు  రామ్‌చరణ్‌ పోలీసు అధికారి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.మరోవైపు ప్రభాస్ ఈసినిమాలో అతిథి పాత్రలో మెరవబోతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికీ రెండు షెడ్యూల్లు కంప్లీటైన ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఫైనల్ కాలేదు. మరోవైపు ఈసినిమాను రాజమౌళి..‘బాహుబలి’ తరహాలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నట్టు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. మరి ఈ ప్రెస్ మీట్‌ల్ రాజమౌళి చెప్పబోయే విషయాలు ఏమిటో అని ఇండియా వైడ్‌గా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

1897లో అల్లూరి సీతారామరాజు పుట్టాడు. అతను ఇంగ్లీష్‌తో పాటు వేదాలు, పురాణాల్లోను మంచి అవగాహన పెంచుకున్నాడు. రెండు ఏళ్ల పాటు ఆయన ఏమి చేసాడో ఎవరికీ తెలియదు.1901 రెండు మూడు సంవత్సరంలో కొమరం భీమ్ యుక్త వయసులో ఉండగానే ఇల్లు ఒదిలి వెళ్లిపోయాడు. ఆయన కూడా ట్రైబల్ స్వతంత్య్రం కోసం పోరాడాడు. ఇంటి నుంచి వెళ్లేటపుడు ఏమి చదువుకోని కొమరం భీమ్..ఆ తర్వాత చదువుకొని వస్తాడు. ట్రైబల్స్ కోసం పోరాడుతాడు. వీళ్లిద్దరు ఒకరి జీవితంలో మరొకరు కలసుకోలేదు. దాన్ని ప్రేరణగా తీసుకొని ఈ సినిమాను ఫిక్షన్‌గా  తెరకెక్కిస్తున్నట్టు రాజమౌళి తెలిపాడు.

RRR సినిమాను 1920 ప్రాంతంలో ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ ఫ్లాష్‌బ్యాక్‌లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నట్టు జక్కన్న కన్ఫామ్ చేసాడు. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ రామ్ చరణ్ సరసన నటించబోతున్నట్టు రాజమౌళి తెలిపాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ యంగ్ కొమరం భీమ్ క్యారెక్టర్‌లో నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు రామ్ చరణ్ ..యంగ్ అల్లూరి సీతారామరాజు స్టోరీ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈసినిమా టైటిల్ మాత్రం RRR అని చెబుతున్నారు. అంతేకాదు అన్ని భాషల్లో RRR టైటిల్ ఉన్నా ఆయా భాషల్లో వేరే టైటిల్స్ వచ్చేటట్టు ఈ సినిమా టైటిల్ ఉంటుందని రాజమౌళి ప్రకటించారు. అంతేకాదు ఈసినిమాను 2020 జూలై 30న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
First published: March 14, 2019, 11:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading