Home /News /movies /

RRR PRE RELEASE EVENT SALMAN KHAN TO COME AS CHIEF GUEST HERE ARE THE DETAILS SR

RRR Pre release event : భారీగా ఆర్ ఆర్ ఆర్ ప్రిరిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌ ఎవరో తెలుస్తే మైండ్ బ్లాంక్..

RRR Photo : Twitter

RRR Photo : Twitter

RRR Pre release event : ఈ సినిమా ప్రమోషన్స్‌లో ముంబైలో గ్రాండ్‌గా జరుగునున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో ఓ రేంజ్‌లో ప్లాన్ చేసిందట చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హిందీ సూపర్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా రానున్నారని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
  ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది చిత్రబృందం. దీంతో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసిన టీమ్.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ ఓ రేంజ్‌లో ఉందని అంటున్నారు నెటిజన్స్. కొన్ని సీన్స్ మాత్రం రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయని అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ ట్రైలర్‌ను చూసిన సినీ ప్రముఖులు సైతం అదిరిపోయిందని కామెంట్స్ పెడుతున్నారు.

  ఇక అది అలా ఉంటే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ముంబైలో గ్రాండ్‌గా జరుగునున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో ఓ రేంజ్‌లో ప్లాన్ చేసిందట చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హిందీ సూపర్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా రానున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఇక ఈ చిత్రం ఓటిటి రిలీజ్‌ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ టైమ్‌కు తెలిసింది. ఆర్ ఆర్ ఆర్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చిందని అంటున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ విడుదల తేది దగ్గరపడుతుండడంతో ఓ రేంజ్‌లో ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది.


  ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.

  Shyam Singha Roy : శ్యామ్ సింగ రాయ్ కోసం నాచురల్ స్టార్ నాని బోల్డ్ స్టెప్..

  ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: NTR, Ram Charan, RRR, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు