Home /News /movies /

RRR PRE RELEASE EVENT RRR WAS DECIDED BY GOD JR NTR EMOTIONAL SPEECH AT KARNATAKA CHIKBALLAPUR PRE RELEASE EVENT TA

RRR Pre Release Event : ఆర్ఆర్ఆర్‌ను ఆ దేవుడే నిర్ణయించారు.. చిక్‌బళ్లాపూర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ఎమోషనల్..

RRR ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ప్పీచ్ (Twitter/Photo)

RRR ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ప్పీచ్ (Twitter/Photo)

ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం)  (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ శనివారం కర్ణాటకలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

ఇంకా చదవండి ...
    Jr NTR Speech at RRR Pre Release Event ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం)  (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

    దుబాయ్‌లో ప్రీ రిలీజ్ వేడుక తర్వాత ఈ శనివారం కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో నిర్వహించారు. ఈ  వేడుకలకు కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మైతో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముందుగా కన్నడీగుల ఆరాధ్య హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులు అర్పించారు. ఆయన మన మధ్య లేకపోయినా.. ఈ సాయంత్రం ఈ వర్షపు చినుకుల రూపంలో.. చల్లని గాలి రూపంలో మన పక్కనే ఉన్నారని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. పునీత్ లేడనే విషయాన్ని తానెప్పుడు ఏడవలేదనన్నారు. ఇకపై ఏడవను అని కూడా స్పష్టం చేశారు.

    RRR Pre Relese Event : రామ్ చరణ్ నా రాముడు.. ఎన్టీఆర్ నా భీముడు.. ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి..


    ఈ సందర్బంగా అప్పును తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఇక మేం పిలిచిన వెంటనే ఎన్ని పనులున్న పక్కన పెట్టి వచ్చిన ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతోపాటు కర్ణాటక మంత్రులకు, రామ్ చరణ్ అభిమానులకు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు ఎన్టీఆర్.ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఏదో యాదృచ్చికంగా ఆ పేరును పెట్టాము. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు..  మా ముగ్గురి మధ్య ఉన్న బంధం అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.ఈ సినిమాను రామ్ చరణ్‌తో రాజమౌళితో చేయడాన్ని ఆ దేవుడే నిర్ణయించినట్ట చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రాంతీయ సరిహద్దలను చెరిపేసిందన్నారు. భారతీయ సినిమాగా రాజమౌళి కన్న గొప్ప కల ఆర్ఆర్ఆర్ మూవీ. ఈ సినిమాలో నాకు ఒక కథానాయకుడిగా అవకాశం ఇచ్చిన రాజమౌళికి ధన్యవాదాలు తెలియజేసారు తారక్.

    RRR : ఆర్ఆర్ఆర్ దేశం మొత్తం గర్వించే చిత్రం అవుతోంది.. కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై..


    మార్చి 20న ఆర్ఆర్ఆర్ టీమ్.. బరోడా.. ఆ తర్వాత ఢిల్లీ.. మార్చి 21న పంజాబ్‌లోని అమృత్‌సర్‌తో పాటు రాజస్థాన్‌లోని జైపూర్‌లో..మార్చి 22న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తాతో పాటు వారణాసీలో  ప్రీ రిలీజ్ రిలీజ్ వేడుకల్లో భాగంగా  ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తంగా మార్చి 25న రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ మూవీని వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం పూర్తి చేయనున్నారు. ఈ చిత్రాన్ని 1920 బ్యాక్ డ్రాప్‌ నేపథ్యంలో ఇద్దరు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. వీళ్లిద్దరి గురువు పాత్రలో అజయ్ దేవ్‌గణ్ నటించారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jr ntr, Rajamouli, Ram Charan, Roudram Ranam Rudhiram, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు