RRR - Baahubali: ‘బాహుబలి 2’ ను క్రాస్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. లెక్కలు తెలిస్తే షాకే..!

RRR pre release business breaks Baahubali 2 record

RRR - Baahubali: ఆర్ఆర్ఆర్ సినిమాను రూ.400 నుంచి రూ.450 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. నిర్మాత ఖ‌ర్చు పెట్టిన డ‌బ్బునంతా థియేట్రిక‌ల్‌రైట్స్ రూపంలోనే ద‌క్కించుకోవాలని జ‌క్క‌న్న ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ లెక్కలు తెలిస్తే షాకవుతారు మరి...

  • Share this:
    తెలుగు సినిమా మేకింగ్ స్టామినాను ప్యాన్ ఇండియాకే కాదు.. ప్ర‌పంచానికి తెలియ‌జెప్పిన చిత్రం బాహుబ‌లి. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ.2400 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించి ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీకి షాకిచ్చింది. దీంతో ఇప్పుడు రాజ‌మౌళి త‌దుప‌రి సినిమా కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే రాజ‌మౌళి టాలీవుడ్ టాప్‌స్టార్స్ అయినా ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఎప్పుడో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. అక్టోబ‌ర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)’ను విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం ట్రిపుల్ ఆర్ క్లైమాక్స్ షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది.

    ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల‌వుతున్న ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ కోసం భారీ పోటీ నెల‌కొంద‌ట‌. ఉన్న క్రేజ్‌ను రాజ‌మౌళి ఎన్‌క్యాష్ చేసుకోవాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. అందుకు త‌గిన‌ట్లుగానే భారీ రేట్స్ చెబుతున్నార‌ట ట్రిపుల్ ఆర్ నిర్మాత‌లు. ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న స‌మాచారం మేర‌కు...

    ఆంధ్ర - రూ. 165 కోట్లు
    తెలంగాణ - రూ. 75 కోట్లు
    క‌ర్ణాట‌క - రూ.45 కోట్లు
    కేర‌ళ - రూ. 15 కోట్లు
    త‌మిళ‌నాడు - రూ. 50 కోట్లు
    హిందీ - రూ. 100 కోట్లు
    ఓవ‌ర్ సీస్ - రూ. 70 కోట్లు
    మొత్తం - రూ.520 కోట్ల థియేట్రిక‌ల్ రైట్స్

    ఆర్ఆర్ఆర్ సినిమాను రూ.400 నుంచి రూ.450 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. నిర్మాత ఖ‌ర్చు పెట్టిన డ‌బ్బునంతా థియేట్రిక‌ల్‌రైట్స్ రూపంలోనే ద‌క్కించుకోవాలని జ‌క్క‌న్న ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన డిజిట‌ల్, శాటిలైట్‌, ఇత‌ర హ‌క్కుల నుంచి వ‌చ్చేదంతా లాభాలే అవుతుంది మ‌రి. ఇంత భారీ ధ‌ర‌లు చెప్పినా రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై డిస్ట్రిబ్యూట‌ర్స్ ఆస‌క్తి చూపుతున్నార‌ట‌. రాజమౌళి ప్లాన్ చేసినట్లు బిజినెస్ అయితే బాహుబలి ప్రీ రిలీజ్ బిజినెస్‌ను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేసేస్తుంది.

    1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ మూవీ ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)’. ఇందులో కొమురం భీమ్ పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తే.. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నటిస్తున్నాడు. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.
    Published by:Anil
    First published: