ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. బాహుబలి సినిమా కంటే ఎక్కువగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్ చరిత్రను సృష్టించింది. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మార్చి 25న థియేటర్లలో విడుదలై.. రికార్డుల మోత మోగించిన ఆర్ఆర్ఆర్.. తాజాగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇవాళ ఓటీటీలో ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది.
(RRR)చిత్రం ZEE 5 లో మే 20 నుండి ఉచితంగా లభించనుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తోంది ZEE 5. ప్రారంభించిన నాటినుండి వినోదంలో వీక్షకులను ఆకట్టుకుంటూ ఓటిటి లలోనే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి పాపులర్ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రాన్ని అన్ని భారతీయ భాషలలో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రం పే పర్ వ్యూ విధానంలో అందుబాటులో ఉంటుందని ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే.. కానీ ఆ విషయంలో ప్రేక్షకుల నుంచి భారీగా వ్యతిరేకత వచ్చింది. సాధారణ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, "ZEE5" T-VOD మోడ్‌ను తొలగించాలని నిర్ణయించింది. సాధారణ చందాదారులందరికీ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రాన్ని ఫ్రీ గా చూసే అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆర్ఆర్ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 14 మిలియన్ డాలర్స్‌పైగా వసూలు చేసి రూ. 100 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. అయితే అమెరికాలో ఈ ఫీట్ సాథించిన మరో సినిమా బాహుబలి 2 (Bahubali).. ఇండియా నుంచి ఈ రెండు సినిమాలు అమెరికాలో 100 కోట్ల గ్రాస్‌ను అందుకున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్ హక్కులను జీ5 భారీ డీల్‌కు సొంతం చేసుకోగా.. హిందీ వెర్షన్ హక్కులను మాత్రం నెట్‌ఫ్లిక్స్ కొనుగొలు చేసింది. ఇక ఈ సినిమాను జూలై నెలలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Netflix, Ott realease, Rajamouli, RRR, Zee5