RRR - Oscar: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు.ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో మన తెలుగు చిత్రం ఆస్కార్ అవార్డును తొలిసారి గెలచుకుంది. నాటు నాటు పాటకు సంగీతం అందించిన కీరవాణి, పాటల రచయత చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో లో 95 వ ఆస్కార్ పురస్కార వేడుకల్లో తెలుగు సినిమా “ RRR “ లో “నాటు – నాటు “ పాటకు ఆస్కార్ పురస్కారం ( బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ) రావడం తెలుగు సినిమా పరిశ్రమే కాకుండా భారతదేశం మొత్తం సినిమా పరిశ్రమకు గర్వకారణం..
ఈ సందర్బంగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి మరియు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరుపున " RRR " సినిమా నిర్మాతకు D.V.V దానయ్య గారికి, దర్శకులు S.S రాజమౌళి గారికి, అద్భుతమైన సంగీతం అందించిన M.M కీరవాణి గారికి, ఇంత అద్భుతమైన పాట రాసిన చంద్ర బోస్ గారికి, గాత్రం అందించిన కాలభైరవ గారికి, మరియు రాహుల్ సిప్లిగంజ్ గారికి, ఆ పాటకి అద్భుతమైన డాన్స్ చేసిన ఇద్దరు హీరోలు నందమూరి తారక రామారావు గారికి (జూనియర్ ఎన్టీఆర్),కొణిదెల రామ్ చరణ్ గారికి, ఆ డాన్స్ కు కొరియోగ్రాఫి అందించిన ప్రేమ్ రక్షిత్ గారికి, మరియు సినిమా కు పని చేసిన మొత్తం టీమ్ కు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసారు.
భవిష్యత్తులో మన తెలుగు సినిమా పరిశ్రమకు ఇటువంటి ఆస్కార్ అవార్డులు మరిన్ని రావాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అకాంక్షిస్తుందని మీడియాకు విడుడల చేసిన లేఖలో పేర్కొన్నారు.
95 వ అకాడమీ(Oscars) అవార్డులలో తెలుగు సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ దక్కింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు పాట... ఆస్కార్‌కి దక్కించుకోవడం ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించినట్టైంది. ఓ తెలుగు చిత్రం ఆస్కార్‌కి నామినేట్ కావడం ఇదే తొలిసారి. ఆ పురస్కారం అందుకోవడం కూడా మొదటిసారే. అచ్చమైన భారతీయ సినిమాకి దక్కిన తొలి ఆస్కార్‌గా చరిత్ర సృష్టించింది. నాటు నాటుకు సంగీతం అందించిన కీరవాణి ఆస్కార్ ప్రతిమ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజమౌళిని ఉద్దేశిస్తూ ఓ పాట కూడా పాడారు. ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట నామినేషన్ పొందింది. ఈ పాటతో పాటు మరో నాలుగు పాటలు (అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్), హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) సినిమాలవి నామినేట్ అయ్యాయి. ఇక ఈరేసులో తెలుగు సినిమా ఆస్కార్ పొంది భారతీయ చలనచిత్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
ఇక ఇదే ఆస్కార్ కార్యక్రమంలో మరో భారతీయ డాక్యుమెంటరీకి ఆస్కార్ దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్‌ను గెలుచుకుంది. ఇది ఇండియా నుంచి నామినేట్ అయిన డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్. హాలౌట్, హౌ డూ యూ మేజర్ ఏ ఇయర్, ది మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్రెంజర్ ఎట్ ది గేట్.. పోటీ పడ్డాయి.. ఈ డాక్యుమెంటరీని కార్తీకి గాన్ స్లేవ్స్, గునీత్ మెంగా నిర్మించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Naatu Naatu, Rajamouli, Ram Charan, RRR, TFCC