RRR : మొదలైన ఆర్ఆర్ఆర్ మేనియా.. గూగుల్‌లో ఆమె పేరే టాప్..

రే స్టీవెన్‌సన్,ఒలీవియా మోరిస్,అలీసన్ డూడీ

RRR : ఎన్టీఆర్ సరసన జెన్నీఫర్ పాత్రలో 'ఒలీవియా మోరిస్',బ్రిటీష్ స్కాట్ పాత్రలో రే స్టీవెన్‌సన్,లేడీ స్కాట్‌గా అలీసన్ డూడీ నటిస్తున్నట్టు ప్రకటించడంతో.. గూగుల్‌లో దేశవ్యాప్తంగా ఎంతోమంది నెటిజెన్స్ వీరి గురించి వెతకడం మొదలుపెట్టారు.

  • Share this:
    సినిమాల్ని తెరకెక్కించడమే కాదు.. దానికి భారీ హైప్ తీసుకురావడంలోనూ దర్శకుడు రాజమౌళి శైలి విభిన్నం. పాన్ ఇండియా సినిమాగా బాహుబలికి ఎక్కడా లేని పాపులారిటీ తీసుకొచ్చిన రాజమౌళి..ఇప్పుడు RRR సినిమాకు కూడా దేశం దృష్టిని ఆకర్షించే పనిలో పడ్డాడు. క్యాస్టింగ్ దగ్గరి నుంచే సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడుకునేలా చేశాడు. RRR సినిమాలో హాలీవుడ్ క్యాస్టింగ్‌ను తీసుకున్న రాజమౌళి.. వారి పేర్లను ప్రకటించడం దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారింది.

    ఎన్టీఆర్ సరసన జెన్నీఫర్ పాత్రలో 'ఒలీవియా మోరిస్',బ్రిటీష్ స్కాట్ పాత్రలో రే స్టీవెన్‌సన్,లేడీ స్కాట్‌గా అలీసన్ డూడీ నటిస్తున్నట్టు ప్రకటించడంతో.. గూగుల్‌లో దేశవ్యాప్తంగా ఎంతోమంది నెటిజెన్స్ వీరి గురించి వెతకడం మొదలుపెట్టారు. గతంలో వీరు చేసిన సినిమాలు.. వీరికున్న పాపులారిటీ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఒలీవియా మోరిస్ పేరు ఇండియాలో ఎక్కువసార్లు ట్రెండ్ అయింది. బుధవారం ఒక్కరోజే దాదాపు 2లక్షల సార్లు ఆమె పేరును గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఇదే విషయాన్ని RRR చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రేక్షకులు సినిమా పట్ల ఇంత క్యురియాసిటీతో ఉండటంపై సంతోషం వ్యక్తం చేసింది. మొత్తం మీద హాలీవుడ్ క్యాస్టింగ్‌తో RRR సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ తీసుకొచ్చాడు జక్కన్న.


    Published by:Srinivas Mittapalli
    First published: