RRR: కొమరం భీమ్‌కు రామరాజు పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్.. రాముడు భీముడు దోస్తీకి ఫ్యాన్స్ ఫిదా..

RRR NTR Ramaraju For Bheem |  ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా  ‘రౌద్రం రణం రుధిరం’ అదే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ  చేసాడు. తాజాగా ఈ సినిమా నుంచి రామరాజు వాయిస్ ఓవర్ ‌తో విడుదలైన కొమరం భీమ్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

news18-telugu
Updated: October 22, 2020, 2:21 PM IST
RRR: కొమరం భీమ్‌కు రామరాజు పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్.. రాముడు భీముడు దోస్తీకి ఫ్యాన్స్ ఫిదా..
జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ (RRR Ram Charan Jr NTR)
  • Share this:
RRR NTR Ramaraju For Bheem |  ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా  ‘రౌద్రం రణం రుధిరం’ అదే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ  చేసాడు.  ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నట్టు ఇప్పటికే రాజమౌళి తెలియజేసారు. ఇప్పటికే అల్లూరి సీతరామరాజుగా రామ్ చరణ్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రామరాజు పాత్రకు కొమరం భీమ్ వాయిస్ ఓవర్ అదిరిపోయింది. తాజాగా ఆర్ఆర్ఆర్ నుండి కొమరం భీమ్ టీజర్‌ను విడుదల చేసారు. రామరాజు వాయిస్ ఓవర్ మొదలైన ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి  రెస్పాన్స్ వచ్చింది.


ఇక దర్శక బాహుబలి రాజమౌళి ముందుగా మోషన్ పోస్టర్‌లో చూపింంచిన‌ట్టే ఒక‌రు అగ్ని, మ‌రోక‌రు నీళ్ళులా ఈ టీజ‌ర్ కొండ‌లొయ‌ల్లో సెల‌యేళ్ళ మీద విజువ‌ల్ షూట్ చేసాడు. అగ్ని స్వ‌భావమున్న పాత్రధారి అల్లూరి సీతారామ‌రాజు ప‌వ‌ర్‌ఫుల్ వాయిస్‌తో ఈ టీజ‌ర్ కి ప్రాణం పోసాడు రామ్‌చ‌ర‌ణ్‌. ఇంతకు ముందు రామ్ చరణ్  పుట్టినరోజు సందర్భంగా..  అల్లూరి సీతారామ‌రాజు పాత్ర స్వ‌భావాన్ని తెలిపే బాధ్యత కొమ‌రం భీం తీసుకుంటే ఈ సారి కొమ‌రం భీం పాత్ర స్వ‌భావాన్ని తెల‌పే బాధ్యత అల్లూరి సీతారామ‌రాజు తీసుకున్నాడు.

RRR Rajamouli NTR Ram Charan RRR team Release New Promo to start Shooting,NTR as Komaram Bheem teaser,rrr movie,rrr movie twitter,rrr movie teaser,rrr latest update,ntr komaram bheem,rrr movie update oct 6th,rajamouli ram charan jr ntr rrr movie update,rrr movie shooting on oct 6th,rrr movie hyderabad shooting,rrr movie updates,telugu cinema,ట్రిపుల్ ఆర్ అప్‌డేట్,ట్రిపుల్ ఆర్ షూటింగ్,రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి ట్రిపుల్ ఆర్ అప్ డేట్,ఆర్ఆర్ఆర్ లేటెస్ట్ టీజర్
ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ రాజమౌళి (Twitter/Photo)


రాజ‌మౌళి విజువ‌ల్ ఫీస్ట్ మాత్రం రెండు టీజ‌ర్స్ కి స‌మానం గా అందించాడు. రామ్‌చ‌ర‌ణ్ వాయిస్‌కి ఇటు మెగాఫ్యాన్స్‌.. అటు నంద‌మూరి ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇంత బ్యాల‌న్స్ గా ప్ర‌మెష‌న్ ప్లాన్ చేస్తున్న రాజ‌మౌళికి ట్రేడ్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. వాడు క‌న‌బ‌డితే స‌ముద్రాలు త‌డ‌బ‌డ‌తాయ్‌..నిల‌బ‌డితే సామ్రాజ్యాలు సాగిల‌ప‌డ‌తాయ్‌..వాడి పొగ‌రు ఎగిరే జెండా..వాడి ధైర్యం చీక‌ట్ల‌ని చీల్చే మండుటెండ‌..వాడు భూత‌ల్లి చ‌నుపాలు తాగిన మ‌న్యం ముద్దు బిడ్డ‌., నా త‌మ్ముడు గోండు వీరుడు కొమ‌రం భీం.. అంటూ రామ్ చ‌ర‌ణ్ విజువ‌ల్ కి త‌గ్గట్టుగా వాయిస్ పిచ్ పెంచుతూ చెప్ప‌టం ఈ టీజ‌ర్ కి హైలెట్ గా నిలిచింది. మొత్తంగా ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల జీవిత కథకు తనదైన కాల్పినికత జోడించిన రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ వండర్ ఫీస్ట్ రిలీజైన తర్వాత ప్రేక్షకులను అదే రీతిలో అలరించడం ఖాయం అని చెప్పొచ్చు.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 22, 2020, 2:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading