RRR NTR Ramaraju For Bheem | ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ‘రౌద్రం రణం రుధిరం’ ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అక్టోబర్ 22న ఏ టైమ్‌కు విడుదల చేసేది కూడా అఫీషియల్‌గా ప్రకటించారు.
RRR NTR Ramaraju For Bheem | ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ‘రౌద్రం రణం రుధిరం’ ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ చేసాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నట్టు ఇప్పటికే రాజమౌళి తెలియజేసారు. ఇక తెలుగు తెరపై చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు బడా మాస్ హీరోలు కలిసి నటిస్తోన్న అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇది. ఈ చిత్రం పై తెలుగు ఇండస్ట్రీలో చాలా అంచనాలు ఉన్నాయి. పైగా బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన రామ్ చరణ్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా రాజమౌళి దాదాపు ఏడు నెలల లాంగ్ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఈ టెస్ట్ షూట్ చేసారు.
దానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా ఈ నెల 22న ఈసినిమాలో ఎన్టీఆర్ భీమ్‌గా నటించబోయే టీజర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఆ టీజర్‌ను విడుదల చేసే టైమ్‌ను కూడా అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్.. భీమ్‌గా నటించిన టీజర్‌ను విడుదల చేయనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. అది కూడా తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో తారక్ ఫ్యాన్స్ .. ఎపుడెపుడా అని టీజర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.