RRR NEW RELEASE DATES RRR MOVIE WILL RELEASE ON 18TH MARCH OR WILL RELEASE ON 28TH APRIL 2022 HERE ARE THE DETAILS SR
RRR New Release Dates : ఆర్ ఆర్ ఆర్ విడుదలపై క్లారిటీ.. రెండు డేట్లను లాక్ చేసిన టీమ్..
RRR New date Photo : Twitter
RRR New Release Dates : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కరోనా కారణంగా మరోసారి వాయిదా పడింది.
ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కరోనా కారణంగా మరోసారి వాయిదా పడింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అనేక రాష్ట్రాలు థియేటర్స్‌ను మూసివేస్తున్న నేపథ్యంలో తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆ మధ్య ప్రకటించింది. దీంతో జనవరి 7న విడుదలకానున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా కోసం రెండు తేదీలను లాక్ చేసిందీ టీమ్. దీనికి సంబంధించి మేకర్స్ అధికారికంగా ఒక నోట్‌ను విడుదల చేసారు. కరోనా మహమ్మారి తగ్గి పరిస్థితి మెరుగ్గా ఉండి.. థియేటర్లు 100% కెపాసిటీతో రన్ అయితే ఈ సినిమా మార్చి 18న విడుదల అవుతుందని.. లేకపోతే.. ఏప్రిల్ 28 న థియేటర్లలో విడుదల అవుతుందని తెలిపింది. చూడాలి మరి ఈ సారైనా ఈ సినిమా అనుకున్న డేట్‌కు విడుదలవుతుందో లేదో.. ఇక గతంలో కూడా పలుమార్లు ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక్కడ విషయం ఏమంటే ఆర్ ఆర్ ఆర్ కారణంగా మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ఎఫ్ 3 సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయి. దీంతో ప్రస్తుతం సంక్రాంతి బరిలో బంగార్రాజు మినహా అన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి.
ఇక ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ట్రైలర్‌ను పలు పాటలను విడుదల చేసిన టీమ్.. తాజాగా ఈ చిత్రం నుండి రైజ్ ఆఫ్ రామ్ పేరిట ఓ పాటను విడుదల చేసింది. రామమ్ రాఘవమ్ అంటూ సాగే ఈ పాటను కే. శివ దత్తా రాశారు. విజయ్ ప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరణ్‌లు పాడారు. ఈ పాట డిసెంబర్ 31 రాత్రి 9 గంటలకు విడుదల చేసింది టీమ్. లిరిక్స్ మొత్తం సంస్కృతంలో ఉండడంతో పాటు వీడియోను కూడా మంచి విజువల్స్‌తో నింపారు. ఇక మరోవైపు ఈ చిత్రం ఓటిటి రిలీజ్ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ టైమ్‌కు తెలిసింది. ఆర్ ఆర్ ఆర్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చిందని అంటున్నారు.
ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రి రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు. ఈ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.