Home /News /movies /

RRR NEW RELEASE DATE MISTAKENLY LEAKED BY ENGLISH ACTOR ALISON DOODY HERE ARE THE DETAILS SR

RRR Release Date : ఆర్ ఆర్ ఆర్ కొత్త రిలీజ్ డేట్‌ను పొరపాటున లీక్ చేసిన ఇంగ్లీష్ నటి ఆలిసన్ డూడీ..

ఆర్ ఆర్ ఆర్ టీమ్ Photo : Twitter

ఆర్ ఆర్ ఆర్ టీమ్ Photo : Twitter

RRR Release Date Leaked : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఇటు హిందీ తెలుగు తమిళ నటులతో పాటు ఈ సినిమాలో బ్రిటిష్ నటి కూడా నటిస్తోంది. ఇదంతా బాగున్న ఈ నటి ఆర్ ఆర్ ఆర్ సినిమా డేట్‌ను పొరపాటుగా లీక్ చేసిందని తెలుస్తోంది. ఇంగ్లీష్ నటి అలిసన్ డూడి ఈ సినిమాలో లేడీ స్కాట్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా ఇటీవల క్లైమాక్స్ షూట్ కు సిద్దమైందన్న సంగతిని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన నటి RRR రిలీజ్ డేట్ అక్టోబర్ 8 న అన్నట్లు పోస్ట్ చేసింది. అయితే వెంటనే పొరపాటు జరిగిందని గ్రహించిన ఆ నటి.. ఆ పోస్ట్‌ను వెంటనే తొలగించింది.

    ఆ తర్వాత మళ్ళీ నార్మల్ ఫోటో పెట్టి పోస్ట్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆ ఫోటోను డౌన్ లోడ్ చేసుకున్న నెటిజన్స్.. ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అభిమానులు ఓహో ఈ సినిమా అక్టోబర్ 8న విడుదలకానుందా.. అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.








    View this post on Instagram






    A post shared by Alison Doody (@alison_doody)













    View this post on Instagram






    A post shared by Alison Doody (@alison_doody)













    View this post on Instagram






    A post shared by Alison Doody (@alison_doody)





    ఇక లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం కావడం తో ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ లో చిత్ర యూనిట్ బిజీ గా ఉంది. లాక్ డౌన్ తొలగించిన వెంటనే ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం 50రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఈ చిత్రం కోసం బాలీవుడ్ నటి అలియా భట్ ఇటీవల ఆర్ ఆర్ ఆర్ టీమ్‌తో జాయిన్ అయ్యింది. ఇప్పటికే ఆలస్యం కావడంతో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు టీమ్. ఈ సినిమాలో ఆమె రామ్ చరణ్ కు జోడిగా నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రధాన తారాగణం విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు 'ఆర్ఆర్ఆర్‌'తో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ టాలీవుడ్‌కు పరిచయమవుతుండగా, మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు. ఒలీవియా మోరిస్‌, శ్రియా శరన్‌, ఆలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్‌, సముద్రఖని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిపంచనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Rrr movie, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు