Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    RRR : భీమ్ టీజర్‌‌ కోసం రాజమౌళి టీమ్ ఆ సీన్స్‌ను కాపీ కొట్టిందా..

    RRR : ఆర్ ఆర్ ఆర్ నుండి తాజాగా విడుదలైన 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ లోని కొన్ని షాట్స్ వేరే చోట నుంచి ఎత్తేశారని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

    news18-telugu
    Updated: October 23, 2020, 1:32 PM IST
    RRR : భీమ్ టీజర్‌‌ కోసం రాజమౌళి టీమ్ ఆ సీన్స్‌ను కాపీ కొట్టిందా..
    ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ Photo : Twitter
    • Share this:
    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమురం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. కాగా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ మధ్య సీతారామరాజుగా చరణ్ ఎంట్రీ అదిరింది. చరణ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. తాజాగా కొమురం భీమ్ 119వ జయంతి సందర్భంగా ఎన్టీ ఎన్టీఆర్ ఇంట్రోను విడదుల చేసింది చిత్రబృందం.  అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అదిరిపోయింది టీజర్.  ఎన్టీఆర్ నటనకు తగ్గట్లు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అదిరింది. అయితే ఈ టీజర్‌లో కొన్ని షాట్స్ కాపీ కొట్టారని ట్వీట్టర్‌‌లో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు దానికి వారు సాక్ష్యాలను కూడా చూపెడుతున్నారు.



    'రామరాజు ఫర్ భీమ్' టీజర్ లోని కొన్ని షాట్స్ వేరే చోట నుంచి ఎత్తేశారని ట్రోల్ చేస్తున్నారు. చరణ్ ని పంచభూతాలైన అగ్నిగా చూపించిన రాజమౌళి.. తారక్ ని నీటితో చూపించాడు. ఎన్టీఆర్ స్టన్నింగ్ పెరఫార్మన్స్ కి అద్భుతమైన విజువల్స్ తోడై ఈ టీజర్ అందరి అంచనాలను రీచ్ అయ్యేలా ఉంది. అయితే ఇందులో కనిపించిన కొన్ని షాట్స్ వేరే చిత్రాలను పోలి ఉన్నాయంటూ ట్రోల్స్ చేస్తున్నారు కొందరు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇంట్రో వీడియోలో ఓ అగ్ని పర్వతం బద్ధలైనట్లు చూపించగా.. ఆ షాట్ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ లో అగ్నిపర్వతాల విస్ఫోటనం వీడియోలోని ఓ  పాత షాట్  అని.. దాన్ని రాజమౌళి కాపీ చేసాడని కామెంట్స్ చేస్తున్నారు.  కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా జనవరి 08 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ దాదాపు ఓ ఐదు నెలలు వాయిదా పడింది.
    Published by: Suresh Rachamalla
    First published: October 23, 2020, 1:25 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading