Padma Shri MM Keeravani: ప్రతి యేడాది కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పద్మ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది కూడా కేంద్రం 106 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది. అందులో ఆరుగురికి పద్మ విభూషణ్.. 9 మందికి పద్మ భూషణ్.. 91 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటిచింది. ఈ కోవలో ఆర్ఆర్ఆర్ సినిమాకు అద్భుతమైన బాణీలు సమకూర్చిన కీరవాణికి కేంద్రం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ఇక.. నాటు నాటు పాటతో ఈయన పేరు ఇపుడు విశ్వవ్యాప్తం కూడా అయింది. తాజాగా ఈయన స్వర పరిచిన నాటు నాటు పాట ఇపుడు ఆస్కార్ బరిలో ఉత్తమ గీతం విభాగంలో నామినేట్ అయింది. మన దేశం తరుపున ఓ భారతీయ చిత్రం నామినేట్ కావడం అనేది ఇదే మొదటిసారి.
అంతకు ముందు నాటు నాటు పాటకు కీరవాణి అమెరికాలోని గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. గత కొన్నేళ్లుగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును పొందిన వాటికే ఆస్కార్ అవార్డులు వరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీరవాణి.. త్వరలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. కీరవాణి విషయానికొస్తే.. మనసు మమత చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు.
ఇక నాగార్జున హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన అన్నమయ్య చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఇక ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తరుపున 11 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఇందులో 8 ఉత్తమ సంగీత దర్శకుడిగా అందుకుంటే.. 3 సార్లు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్‌గా ఈ అవార్డును అందుకున్నారు. త్వరలో ఆస్కారు అవార్డు అందుకోవాలని కోరుకుందాం. ఇక సినీ రంగానికి సంబంధించిన రవీనా టాండన్‌కు కేంద్రం పద్మశ్రీ, ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాంకు పద్మభూషణ్ ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: M. M. Keeravani, Padma Awards, Padma Shri, RRR, Tollywood