జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన రాజమౌళి

ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తుందని మొదట ప్రకటించినా.. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. మరి ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరన్నది ఇప్పటి ప్రకటించలేదు. ఆ సందేహాలకు తెరపడే సమయం వచ్చింది.

news18-telugu
Updated: November 19, 2019, 9:50 PM IST
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన రాజమౌళి
జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి (jr ntr rajamouli)
  • Share this:
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు దర్శకుడు రాజమౌళి, RRR చిత్ర బృందం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ మూవీలో రాంచరణ్‌కు జోడీగా అలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తుందని మొదట ప్రకటించినా.. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. మరి ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరన్నది ఇప్పటి ప్రకటించలేదు. ఆ సందేహాలకు తెరపడే సమయం వచ్చింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ రాజమౌళి సినిమాకు సంబంధించి మూవీ యూనిట్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఎన్టీఆర్‌కు జోడీగా నటించే హీరోయిన్‌తో పాటు విలన్ల వివరాలను బుధవారం ప్రకటిస్తామని తెలిపింది.

RRR మూవీ చిత్రీకరణ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది అద్బుతంగా గడిచింది. దాదాపు 70శాతం షూటింగ్ పూర్తయింది. ఇప్పటి వరకు సాగిన ఊహాగానాలకు తెరపడే సమయం వచ్చింది. ఎన్టీఆర్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరనేది నవంబరు 20న వెల్లడిస్తాం. అంతేకాదు ప్రతినాయకుల వివరాలను కూడా ప్రకటిస్తాం.
RRR మూవీ యూనిట్
కాగా, ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా RRR సినిమా తెరకెక్కుతోంది. బాహుబలి-2 తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్నారు. రాంచరణ్‌కు జోడీగా అలియా భట్ నటిస్తోంది. ఇక అజయ్ దేవగన్, సముద్రఖని,రాహుల్ రామృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెట్ పతాకంపై డీవీవీ దానయ్య rrr చిత్రాన్ని నిర్మిస్తుండగా.. MM కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది జులై 30న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
First published: November 19, 2019, 9:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading