RRR లో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందో తెలుసా..

‘బాహుబలి’ రెండు భాగాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి..ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ‘RRR’ వర్కింగ్‌ టైటిల్‌తో భారీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ నడుస్తోంది. 300 కోట్ల‌తో ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్నాడు దాన‌య్య‌. ఈసినిమాలో ఎన్టీఆర్ పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయని చెబుతున్నారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 3, 2019, 6:27 PM IST
RRR లో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందో తెలుసా..
RRR లో ఎన్టీఆర్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 3, 2019, 6:27 PM IST
‘బాహుబలి’ రెండు భాగాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి..ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ‘RRR’ వర్కింగ్‌ టైటిల్‌తో భారీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ నడుస్తోంది. 300 కోట్ల‌తో ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్నాడు దాన‌య్య‌. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కుల కోసం భారీగా పోటీ నెలకొంది. ఈ సినిమాను పీరియడ్ డ్రామాగా, బ్రిటిష్ కాలంలో జరిగిన కథతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో ఎన్టీఆర్ పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే ఒక లుక్‌లో రాజమౌళి..ఎన్టీఆర్ రెండు షెడ్యూల్లను కంప్లీట్  చేసాడు. ఇక చేయబోయే మూడో షెడ్యూల్లో ఎన్టీఆర్ తన బాడీని పెంచే పనిలో ఉన్నాడట.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను రాజమౌళి ఇంత వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా ప్రొజెక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ అడవి దొంగగా ప్రతినాయకుడి ఛాయలు ఎక్కువగా ఉంటాయట. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొన్ని సన్నివేశాల్లో మాములుగా..మరికొన్ని సన్నివేశాల్లో కండలు తిరిగిన దేహంతో కనిపించబోతున్నట్టు సమాచారం. బాహుబలి సినిమాలో ఒక్కో క్యారెక్టర్‌కు సంబంధించిన ఫోటోను విడుదల చేసిన రాజమౌళి ఈ సినిమాలో పాత్రల విషయాన్ని గోప్యంగా ఉంచాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే రామ్ చరణ్ ..‘జంజీర్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. మరోవైపు ఈసినిమాతో ఎన్టీఆర్‌ను గ్రాండ్‌గా బాలీవుడ్‌కు పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

First published: March 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...