Home /News /movies /

RRR MOVIE TWITTER REVIEW RAJAMOULI JR NTR RAM CHARAN GOT SUCCESS AND PUBLIC TALK ABOUT MOVIE TA

RRR Twitter Review : ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ రివ్యూ.. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి మాయ చేసారా..

ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ రివ్యూ (Twitter/Photo)

ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ రివ్యూ (Twitter/Photo)

RRR Twitter Review : ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఆర్ఆర్ఆర్ (Roudram Ranam Rudhiram) ఫీవర్‌తో ఊగిపోతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉందో మన ట్విట్టర్ రివ్యూలో చూద్దాం..

    RRR Twitter Review : ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఆర్ఆర్ఆర్ (Roudram Ranam Rudhiram) ఫీవర్‌తో ఊగిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ షో ద్వారా చాలా ప్రాంతాల్లో విడుదలైంది.  పైగా  ప్యాన్ ఇండియా మూవీ కావడంతో రాజమౌళి.. ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌లను వెంటేసుకొని దేశం మొత్తాన్ని చుట్టేసారు. విడుదల తర్వాత మరోసారి ఈ సినిమాను ప్రమోట్ చేసే అవకాశాలున్నాయి.  ఇక ఈ సినిమాను మేకర్స్.. ఐమాక్స్, 3D, డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ చేస్తున్నారు.ఇక డాల్బీ విడుదల కాబోతున్న మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా  ఈ సినిమా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయింది.

    ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10,000 వేలకు పైగా స్క్రీన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. తెలుగులో ఈ సినిమాకు అనూహ్యమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. నార్త్‌తో పాటు మిగిలిన భాషల్లో ఓ మోస్తరు అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఈ సినిమా అదరగొట్టేలా ఉంది. ఇప్పటికే పలు చోట్ల ఈ సినిమా ప్రీమియర్ షో టిక్కెట్స్‌ను అభిమానులు రూ. 3 వేలు నుంచి 5 వేల మధ్య కొనుగోలు చేసి మరి ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తున్నారు. పైగా మూడేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఎన్టీఆర్.. రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రామ్ చరణ్ ఈ సినిమాతో వెండితెరపై మెరిసారు. మరి వీళ్లిద్దరిని రాజమౌళి స్క్రీన్ పై ఎలా ప్రెజెన్స్ చేసారనే మన ట్విట్టర్ రివ్యూలో చూద్దాం..



















    మొత్తంగా బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాపై అంచనాలు తగ్గట్టే ఉన్నట్టు పబ్లిక్ రెస్పాన్స్ చూస్తే అర్ధమవుతోంది. ఈ సినిమా తెలుగులో బాహుబలి మూవీ సెట్ చేసిన అన్ని రికార్డులను స్మాష్ చేసేలా ఉందని చెబుతున్నారు. పైగా నందమూరి, మెగా కాంబినేషన్‌ను ఒకే తెరపై చూసించి రాజమౌళి అసాధ్యాన్ని సుసాధ్యం చూసారు. పైగా నాలుగేళ్ల కష్టం ఈ సినిమాలో కనిపించింది. మొత్తంగా ఈ సినిమా తెలుగుతో పాటు మిగతా భాషల్లో ఓ చరిత్రను సృష్టించడం ఖాయం అంటున్నారు.

    ఇక ఆర్ ఆర్ ఆర్ (RRR) విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. మరోవైపు ఈ (RRR) చిత్రం ఓటిటి రిలీజ్‌ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ (RRR) విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ajay Devgn, Jr ntr, Rajamouli, Ram Charan, RRR, RRR Movie Review

    తదుపరి వార్తలు