RRR : లాస్ట్ షెడ్యూల్ కోసం ఉక్రెయిన్‌లో లాండ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్..

ఉక్రెయిన్‌లో లాండ్ అయిన ఆర్ఆర్ఆర్ టీమ్ (Twitter/Photo)

RRR : ఆర్ఆర్ఆర్ లాస్ట్ షెడ్యూల్ కోసం ఉక్రెయిన్‌లో లాండ్ అయిన మూవీ టీమ్.. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోసల్ మీడియలో పోస్ట్ చేసారు. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    RRR : ఆర్ఆర్ఆర్ లాస్ట్ షెడ్యూల్ కోసం ఉక్రెయిన్‌లో లాండ్ అయిన మూవీ టీమ్.. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోసల్ మీడియలో పోస్ట్ చేసారు. వివరాల్లోకి వెళితే.. దర్శక బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.  అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా ’ఆర్ఆర్ఆర్’ (Roudram Ranam Rudhiram) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు ప్రాంతానికి చెందిన చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.  ఈ సినిమాను కూడా రాజమౌళి పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పూర్వ జన్మలో స్వాతంత్య్ర పోరాటం కోసం కన్నుమూసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు ఆ తర్వాత జన్మలో ఎలా తమ స్వాతంత్య్ర కాంక్ష నెరవేర్చుకున్నారనేదే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు.

    తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒకటి రెండు పాటలు మినహా టాకీ పార్ట్ పూర్తైయింది. దీంతో చిత్ర యూనిట్  ఈ సినిమా ప్రమోషన్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రపంచ ఫ్రెండిషిప్ దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘దోస్త్’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆర్ఆర్ఆర్ ఈ సినిమాలోని ప్యాచ్ వర్క్‌తో పాటు పాటల కోసం ఉక్రెయిన్‌కు వెళ్లారు. అంతేకాదు అక్కడ ఆర్ఆర్ఆర్ టీమ్ లాండ్ అయిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ షెడ్యూల్‌తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తంగా పూర్తి కానుంది. దీంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయనున్నారు.








    View this post on Instagram






    A post shared by RRR Movie (@rrrmovie)





    ఐతే.. ఈ సినిమాను డీవివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు  నార్త్‌లో పెన్ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ సందర్భంగా పెన్ స్టూడియోస్‌ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ పార్టనర్స్‌ను అనౌన్స్ చేసారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డిజిటల్ రైట్స్‌ను జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు.

    ‘దోస్తి’ సాంగ్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ (Twitter/Photo)


    ఇక హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు ఇంగ్లీష్, టర్కిష్, పోర్చుగీసు, కొరియన్, స్పానిష్ భాషలకు సంబంధించిన డిజిటల్ ప్రసారాలను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది.ఈ సినిమా ఈ యేడాది అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: